ఈ వారం తార

తుళ్లిపడకే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాజల్ ఆనందానికి పట్టపగ్గాల్లేవ్. ఆ ఆనందంలోని తుళ్లింతే ఇది. కారణం -సీన్లోలేని పిల్ల స్క్రీన్ మీదకొచ్చేసింది మరి. 150వ చిత్రంలో చిరుతో జోడీ కట్టేదెవరన్న అంశంపై పెద్ద అధ్యయనమే జరిగింది. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకూ ఎందరినో పరిశీలించారు. అప్పట్లో ఆ జాబితాలో అసలు కాజల్ ఊసు లేదు. సీను క్లైమాక్స్‌కు చేరేసరికి మాత్రం -స్క్రీన్ మీదకు కాజల్ వచ్చింది. ఎలా? అంటే సస్పెన్స్. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో జరుగుతున్న యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్‌లో కాజల్ జాయనైంది కూడా. చిరుతో షూటింగ్ థ్రిల్లుగా ఉందట. తన షెడ్యూల్ పూర్తయ్యేవరకూ ఇదే మూడ్‌ని క్యారీ చేస్తుందట. ‘మగధీర’లో చరణ్ పక్కన మంచి మార్కులే తెచ్చుకున్న కాజల్ -ఇప్పుడు ‘ఖైదీ/150’ చిరు సరసన ఎలాంటి ర్యాంకు సంపాదిస్తుందో చూద్దాం.
పోస్టర్
కాజల్ అగర్వాల్