ఈ వారం స్పెషల్

మహా సంగ్రామం సాకర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడలను యుద్ధాలతో పోలుస్తారు. అంతర్జాతీయ స్థాయ టోర్నీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ, ఏ జట్టు గెలుస్తుందో, ఏ జట్టు ఇంటిదారి పడుతుందోనన్న ఆందోళన అభిమానుల్లో స్పష్టంగా కనిపిస్తాయ. ఇక ప్రపంచ చాంపియన్‌షిప్ కోసం జరిగే పోటీలను వర్ణించడానికి మాటలు చాలవు. భీకర ప్రపంచ యుద్ధాలు కళ్ల ముందు ఆవిష్కృతమవుతాయ. ప్రపంచంలోనే అత్యధిక మంది అభిమానులన్న ఫుట్‌బాల్‌లో వరల్డ్ కప్ ట్రోఫీని అందుకోవడానికి జరిగే సమరం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ప్రేక్షకుల కేరింతలు... వీరాభిమానుల సవాళ్లు, ప్రతిసవాళ్ల మధ్య ప్రతి నాలుగేళ్లకోసారి జరిగే సాకర్ ‘ప్రపంచ యుద్ధం’ ఈనెల 14 నుంచి సుమారు నెల రోజుల పాటు మరోసారి కనువిందు చేయనుంది. 32 జట్లు నువ్వా? నేనా? అన్న చందంగా హోరాహోరీకి సిద్ధమయ్యాయి. అస్తశ్రస్త్రాలను సమకూర్చుకున్నాయి. పోటీలు ప్రారంభమైన మరు క్షణం నుంచే ఆటగాళ్లంతా కొదమ సింహాల్లా విరుచుకుపడడానికి సమాయత్తమవుతున్నారు.
*
ప్రపంచంలో అత్యధిక దేశాల్లో ఆడే క్రీడ సాకర్. ఎక్కువ మంది అభిమానులు ఈ క్రీడకే సొంతం. ఆదాయం విషయంలోనూ సాకర్‌ను మించిన టోర్నీలు లేవు. యూరోపియన్ చాంపియన్‌షిప్ వంటి క్లబ్ స్థాయి పోటీలకే లక్షలాది మంది ప్రేక్షకులతో స్టేడియాలు కిక్కిరిసిపోతాయి. ఇక ప్రపంచకప్ సాకర్ చాంపియన్‌షిప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మైదానంలో జరిగే ఒక మహా యుద్ధం అది. ఫెడెరేషన్ ఇంటర్నేషనేల్ డి ఫుట్‌బాల్ అసోసియేషన్ ‘్ఫఫా’గా పిలిచే అంతర్జాతీయ సాకర్ సమాఖ్య ఆధ్వర్యంలో ప్రతి నాలుగేళ్లకు ఒకసారి హేమాహేమీ జట్లు ట్రోఫీ కోసం జరిపే పోరాటాన్ని లక్షలాది మంది ప్రత్యక్షంగానూ, కోట్లాది మంది అభిమానులు పరోక్షంగానూ తిలకిస్తారు. చాలా క్రీడల్లో ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీలను నిర్వహిస్తున్నప్పటికీ, ‘వరల్డ్ కప్’ అంటే సాకర్ ప్రపంచకప్ అనే అర్థానే్న తీసుకుంటారంటే, దీనికి ఉన్న ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు. నిరాశ పరచిన కొన్ని మ్యాచ్‌లను మినహాయిస్తే, ఈసారి వరల్డ్ కప్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. వివిధ దేశాలకు చెందిన అత్యుత్తమ ఆటగాళ్ల నైపుణ్యం ఒకవైపు, బ్రెజిల్ కార్నివాల్ సోయగాలు వివిధ దేశాల నుంచి వచ్చిన అభిమానులు, అధికారులను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ప్రత్యక్షంగా చూడలేకపోయిన కోట్లాది మంది సాకర్ అభిమానులు టీవీలో మ్యాచ్‌లను చూసి ఆనందిస్తారు. ఏ జట్టు గెలిచినా, ప్రతి మ్యాచ్ అభిమానులను అలరిస్తుందనేది వాస్తవం. డిఫెండింగ్ చాంపియన్ జర్మనీ, రన్నరప్ అర్జెంటీనా, బ్రెజిల్, నెదర్లాండ్స్ తదితర జట్లు టైటిల్ వేటలో ముందుంటాయని అంచనా. పోటీలకు ఆతిథ్యమిస్తున్న రష్యాను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. మొత్తం మీద ఈసారి వరల్డ్ కప్ అభిమానులను ఉర్రూతలూగించడం ఖాయం. 1930లో ప్రారంభమైన ప్రపంచకప్ సాకర్ 1942, 1946 సంవత్సరాల్లో రెండో ప్రపంచ యుద్ధం కారణంగా జరగలేదు. ఇప్పటివరకు 18 వరల్డ్‌కప్ పోటీలు జరగ్గా, ఈఏడాది జూన్ 11 నుంచి జూలై 11వ తేదీ వరకు దక్షిణాఫ్రికా ఈ మెగా ఈవెంట్‌కు ఆతిథ్యమిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 71 కోట్ల మంది అభిమానులు ఈ మ్యాచ్‌లను ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తిలకిస్తారు.
టెన్నిస్‌లో వింబుల్డన్, గోల్ఫ్‌లో యూఎస్ ఓపెన్, లార్డ్స్ మైదానంలో క్రికెట్ టెస్టు మ్యాచ్.. ఇలా జయాపజాలను పక్కకువుంచి, ఈ ఈవెంట్స్‌లో ఆడితేచాలు జన్మధన్యమైందనే అనుకుంటారు. అదే విధంగా వరల్డ్‌కప్‌లో ఒక్క మ్యాచ్ ఆడినా చాలనుకునే సాకర్ ఆటగాళ్లు కోకొల్లలు. ఒక రకంగా ప్రతి ఫుట్‌బాల్ ఆటగాడి ఏకైక కోరిక కూడా అదే. సాకర్ ఆడే దేశాలు కూడా ఇదే లక్ష్యంగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తుంటాయ. పోటీ తీవ్రంగా ఉంది కాబట్టే, ఒక ప్రపంచకప్ ముగిసిన ఏడాదిలోపే క్వాలిఫయింగ్ టోర్నీలు ప్రారంభమవుతాయి. మూడేళ్ల పాటు కొనసాగే ఈ పోటీలు ప్రపంచ సాకర్ జట్లను ‘్ఫఫా’ జల్లెడపడుతుంది. చివరికి తేలే 32 జట్లు ‘వరల్డ్‌కప్ సాకర్ ఫైనల్స్’కు అర్హత పొందినట్టు ప్రకటిస్తారు. మొత్తం ఒక టోర్నీనే ‘ఫైనల్స్’గా పేర్కొనే ఏకైక చాంపియన్‌షిప్ ఇదే. ఇప్పటివరకు జరిగిన 20 వరల్డ్‌కప్ చాంపియన్‌షిప్‌లో బ్రెజిల్ ఐదు టైటిళ్లను సాధించి అగ్రస్థానంలో నిలవగా, ఇటలీ, జర్మనీ చెరి నాలుగు ట్రోఫీలతో రెండో స్థానంలో ఉన్నాయ.
చారిత్రక నేపథ్యం
చాలా క్రీడల్లో మాదిరిగానే సాకర్ వరల్డ్ కప్ పోటీలకు కూడా చారిత్ర నేపథ్యం ఉంది. ఇది ఒక్కసారిగా తెరపైకి వచ్చిన మెగా ఈవెంట్ కాదు. వివిధ జట్లు, క్లబ్‌ల మధ్య సిరీస్‌లు, మ్యాచ్‌లు కొత్తకాకపోయినప్పటికీ, అంతర్జాతీయ ఫుట్‌బాల్ మ్యాచ్ మొట్టమొదటిసారి గ్లాస్గోలో 1872వ సంవత్సరంలో స్కాట్‌లాండ్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగింది. రెండేళ్ల తర్వాత బ్రిటిష్ హోమ్ చాంపియన్‌షిప్ పేరుతో అంతర్జాతీయ సాకర్ చాంపియన్‌షిప్‌ను నిర్వహించారు. అప్పట్లో యునైటెడ్ కింగ్‌డమ్‌లోనే సాకర్‌ను ఎక్కువగా ఆడేవారు. అందుకే, అక్కడే తొలి అంతర్జాతీయ సిరీస్ జరిగింది. క్రమంగా ఇది ఇతర దేశాలకూ వ్యాప్తిచెందింది. 1900, 1904 సంవత్సరాల్లో ఒలింపిక్ క్రీడగా అవతరించినప్పటికీ, అంతర్జాతీయ ఒలింపిక్ సమాఖ్య (ఐఒసి) గుర్తింపు లేనికారణంగా, అవార్డులను ప్రదానం చేయలేదు. 1904లో ‘్ఫఫా’ ఏర్పడిన తర్వాత, స్విట్జర్లాండ్ కేంద్రంగా, అంతర్జాతీయ టోర్నమెంట్ నిర్వహణకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఐఒసితో సంబంధం లేకుండా, ప్రపంచ స్థాయి సాకర్ చాంపియన్‌షిప్ పోటీలకు రూపకల్పన చేసే బాధ్యతను ఫిఫా 1906లో స్వీకరించింది. ఫిఫా విశ్వప్రయత్నాలు చేయడంతో 1908 లండన్ ఒలింపిక్స్‌లో సాకర్ ఒక అధికార క్రీడగా రంగ ప్రవేశం చేసింది. అయితే, ఈ పోటీల్లో ప్రొఫెషనల్ ఆటగాళ్లకు అవకాశం కల్పించలేదు. కేవలం అమెచ్యూర్స్ కోసం నిర్వహించే పోటీగానే పరిమితమైంది. ఒలింపిక్ క్రీడగా ఎదిగినా, అందరికీ అవకాశం లభించకపోవడం ఫిఫాను మళ్లీ ఆలోచనల్లోకి నెట్టింది. 1928 మే 28న జూలెస్ రిమెట్ అధ్యక్షతన జరిగిన ఫిఫా సమావేశంలో ప్రపంచకప్ చాంపియన్‌షిప్‌ను నిర్వహించాలని తీర్మానించారు. 1930లో, ఉరుగ్వే స్వాతం త్య్ర దినోత్సవ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ పోటీలను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఫలితంగా 1930 జూలై 13న తొలి ప్రపంచకప్ చాంపియన్‌షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు, ఒకేసారి రెండు మ్యాచ్‌లు జరిగాయి. మెక్సికోను ఫ్రాన్స్, బెల్జియంను అమెరికా ఓడించాయి. 13 జట్లతో ప్రారంభమైన ప్రపంచకప్ క్రమంగా విస్తరించి ఇప్పుడు 32 జట్ల పోరుగా రూపుదిద్దుకుంది.
సర్వత్రా ఆసక్తి
నాలుగేళ్లకోసారి జరిగే ఫుట్‌బాల్ ప్రపంచ యుద్ధాన్ని చూసేందుకు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈనెల 14 నుంచి రష్యాలో మొదలయ్యే 21వ సాకర్ వరల్డ్ కప్‌ను దక్కించుకునేది ఎవరైనా, విజయం మాత్రం ఫుట్‌బాల్ క్రీడకే దక్కుతుందనడంలో అతిశయోక్తి లేదు. మరో నాలుగు రోజుల్లో క్రీడాభిమానులను ఉర్రూతలూగించే మహా సంగ్రానికి తెరలేవనుంది. మైదానంలోకి దిగే 32 జట్లలో కిరీటం ఎవరికి దక్కినా, ఒక్కో మ్యాచ్ ఓ ఫైనల్‌ను తలపిస్తుందనేది వాస్తవం. విశ్వవిజేతగా నిలవాలన్న పట్టుదలతో, ప్రతి జట్టూ తన ప్రతి మ్యాచ్‌లోనూ సర్వశక్తులు ఒడ్డి పోరాడుతుంది. స్టేడియంలో ప్రత్యక్షంగా మ్యాచ్‌లు చూసేవారేకాదు.. టీవీలో పోటీలను తిలకించే వారుకూడా నరాలు తెగే ఉత్కంఠను అనుభవించడం కొత్తేమీ కాదు. అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య 3్ఫఫా2 ఆధ్వర్యంలో జరిగే మెగా ఈవెంట్‌కు ఆతిథ్యమిచ్చే సువర్ణావకాశం దక్కించుకున్న రష్యా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. సమస్యలను అధిగమిస్తూ, చివరి క్షణం ఏర్పాట్లలో నిమగ్నమైంది. మ్యాచ్‌లకు ఉపయోగించే 3అడిడాస్ బ్రజూకా2 బంతి ఇప్పటికే ప్రపంచం నలుమూలలా సందడి చేస్తున్నాయి. డిఫెండింగ్ చాంపియన్ జర్మనీ, ఆతిథ్య దేశం రష్యా టైటిల్ వేటకు అస్త్రాలను సమకూర్చుకుంటున్నాయి. వీటిలాగానే మిగతా అన్ని జట్లు కూడా వ్యూహ రచనల్లో నిమగ్నమయ్యాయి. మ్యాచ్‌లు గెలిచేందుకు అవసరమైన అన్ని మార్గాలనూ అనే్వషిస్తున్నాయి. రక్షణ విభాగంలో ఎంత పటిష్టంగా ఉంటే, వరల్డ్ కప్‌లో రాణించే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయని పలు అధ్యయనాలు చెప్తున్నాయి. అందుకే, గత రెండు వరల్డ్ కప్ పోటీల్లోనూ 3డిఫెన్స్2 వ్యూహాలు చాలా స్పష్టంగా కనిపించాయి. 2014 వరల్డ్ కప్‌లో గ్రూప్ దశ మ్యాచ్‌లతోపాటు ఫైనల్ కూడా రక్షణాత్మక విధానంలోనే కొనసాగడమే దీనికి నిదర్శనం. రష్యాలోనూ పోటీ పడుతున్న జట్లన్నీ మరోసారి ఈ సూత్రానికే కట్టుబడితే, ఫలితాలపై 3డిఫెన్స్2 ప్రభావం ఎలావున్నా, మ్యాచ్‌లను తిలకిస్తున్న ప్రేక్షకులు మాత్రం నిరాశ చెందడం ఖాయం. 3పవర్ ప్లే2 సాకర్‌లోనూ చోటు చేసుకున్న విషయం యూరో చాంపియన్‌షిప్ వంటి టోర్నీల్లో స్పష్టంగా తెలుస్తోంది. అందుకే, వరల్డ్ కప్ అంతకంటే వేగంగా, దాడులు ప్రతిదాడులతో సాగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌లో జరిగిన గత రెండు వరల్డ్ కప్ టోర్నీలు అభిమానులను నిరాశ పరచాయి. మితిమీరిన డిఫెన్స్ ప్రపంచ కప్‌పై ఆసక్తిని చంపేస్తున్నదని అంతా గగ్గోలు పెడుతున్నారు. రష్యాలోనైనా డిఫెన్స్‌ను పక్కకుపెట్టి, సాకర్‌ను నిజమైన సాకర్‌గానే ఆడతాయని ఆశిస్తున్నారు. వారి అంచనాలకు తగినట్టుగానే రష్యాలో జరిగే 21వ ఫుట్‌బాల్ ప్రపంచ కప్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందని ఆశిద్దాం.
గ్రూప్ ‘ఎఫ్’లో జర్మనీ
క్రెమ్లిన్: డిఫెండింగ్ చాంపియన్ జర్మనీ గ్రూప్ 3ఎఫ్2 నుంచి ఈసారి సాకర్ వరల్డ్ కప్‌లో పోటీపడుతుంది. శుక్రవారం ఇక్కడ అట్టహాసంగా జరిగిన డ్రాలో మొత్తం 32 జట్లను ఎనిమిది గ్రూప్‌లుగా విభజించారు. ఆతిథ్య దేశమైన రష్యా గ్రూప్ 3ఏ2లో ఉండగా, 2014 వరల్డ్ కప్‌ను నిర్వహించిన బ్రెజిల్‌కు గ్రూప్ ఈ2లో చోటు దక్కింది.

‘తొలి’ జట్లు ఇవే...
మొదటి ప్రపంచకప్ సాకర్ చాంపియన్‌షిప్‌లో ఆతిథ్య దేశమైన ఉరుగ్వేతో సహా మొత్తం 13 జట్లు పోటీపడ్డాయి. ఆ దేశాలు ఇవే... ఉరుగ్వే (ఆతిథ్యదేశం), అర్జెంటీనా, బెల్జియం, బ్రెజిల్, బొలీవియా, చిలీ, ఫ్రాన్స్, మెక్సికో, పరాగ్వే, పెరూ, రుమేనియా, అమెరికా, యుగొస్లావియా.
తండ్రే సెలక్టర్!
కన్న తండ్రే సెలక్టరయితే అంత కంటే అదృష్టం ఏం కావాలి? ప్రపంచకప్ సాకర్ చాంపియన్‌షిప్‌లో ఒక జట్టు ఆటగాడిని అతని తండ్రే ఎంపిక చేసిన సంఘటన ఒకటి ఉంది. 1966లో ఉరుగ్వేకు ఆండినొ వియెరా కోచ్‌గా వ్యవహరించాడు. అతని కుమారుడు మిల్టన్ వియెరా సమర్థుడైన ఆటగాడు. ఆ జట్టుకు మిల్టన్‌ను ఎంపిక చేసిన ఆండినొ ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.

ప్రతిసారీ బరిలోకి..
అత్యధికంగా ఐదు పర్యాయాలు ప్రపంచ కప్ సాకర్‌లో విజేతగా నిలిచిన బ్రెజిల్ ఖాతాలో మరో అరుదైన రికార్డు కూడా ఉంది. 1930 నుంచి 2014 వరకూ జరిగిన 20 వరల్డ్ కప్ టోర్నీల్లోనూ బ్రెజిల్ ఆడింది. రష్యాలో జరిగే 21వ ప్రపంచ కప్ బ్రెజిల్ కూడా 21వది కావడం విశేషం. అంటే ఈ మెగా టోర్నీ మొదలైనప్పటి నుంచి ఈ జట్టు ప్రతిసారీ బరిలోకి దిగింది. అంతేగాక, ఇప్పటి వరకూ 20 పర్యాయాలు ‘టాప్-16’లో చోటు సంపాదించింది. ఇక ఎక్కువ పర్యాయాలు రన్నరప్‌గా నిలిచిన జట్టు జర్మనీ. ఎనిమిదిసార్లు ఫైనల్‌లో పరాజయాలను చవిచూసి, రెండ స్థానానికి పరిమితమైంది. ‘టాప్-3’లో ఎక్కువసార్లు చోటు సంపాదించిన జట్టు జర్మనీ. ఈసారి డిఫెండింగ్ చాంపియన్‌గా ఆడుతున్న జర్మనీ 12 పర్యాయాలు ‘టాప్-3’లో చోటు దక్కించుకుంది.
వరుసగా రెండుసార్లు టైటిల్ సాధించిన ఘనతను ఇటలీ, బ్రెజిల్ తమ ఖాతాలో వేసుకున్నాయి. ఇటలీ 1934, ఆవెంటనే 1938లో వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. బ్రెజిల్ 1958లో టైటిల్ అందుకొని, తిరిగి 1962లో చాంపియన్‌షిప్‌ను నిలబెట్టుకుంది. జర్మనీ వరుసగా నాలుగు పర్యాయాలు మూడో స్థానంలో నిలిచి, అరుదైన రికార్డును నెలకొల్పింది. ఈ జట్టు వరుసగా నాలుగు పర్యాయాలు ‘టాప్-3’లో చోటు సంపాదించింది.

వరల్డ్ కప్ గ్రూప్‌లు ఇవే..

గ్రూప్ 3ఏ2: 1. రష్యా, 2. ఉరుగ్వే, 3. ఈజిప్టు, 4. సౌదీ అరేబియా.
గ్రూప్ 3బీ2: 1. పోర్చుగల్, 2. స్పెయిన్, 3. ఇరాన్, 4. మోరాకో.
గ్రూప్ 3సీ2: 1. ఫ్రాన్స్, 2. పెరూ, 3. డెన్మార్క్, 4. ఆస్ట్రేలియా.
గ్రూప్ 3డీ2: 1. అర్జెంటీనా, 2. క్రొయేషియా, 3. ఐస్‌లాండ్, 4. నైజీరియా.
గ్రూప్ 3ఈ2: 1. బ్రెజిల్, 2. స్విట్జర్లాండ్, 3. కోస్టారికా, 4. సెర్బాయా.
గ్రూప్ 3ఎఫ్2: 1. జర్మనీ, 2. మెక్సికో, 3. స్వీడన్, 4. దక్షిణ కొరియా.
గ్రూప్ 3జీ2: 1. బెల్జియం, 2. ఇంగ్లాండ్, 3. ట్యునీషియా, 4. పనామా.
గ్రూప్ 3హెచ్2: 1. పోలాండ్, 2. కొలంబియా, 3. సెనెగల్, 4. జపాన్.

కురువృద్ధుడు మెక్‌డొనాల్డ్
వరల్డ్ కప్‌కు సంబంధించి కురువృద్ధుడిగా మెక్‌డొనాల్డ్ టేలర్ సీనియర్ పేరును చెప్పుకోవాలి. 2004 ఫిబ్రవరి 18న సెయింట్ కీట్స్‌తో క్వాలిఫయింగ్ మ్యాచ్ ఆడినప్పుడు అమెరికా తరఫున ఆడిన మెక్‌డొనాల్డ్ వయసు 46 సంవత్సరాల, 175 రోజులు. వరల్డ్ కప్‌లో ఆడిన వారిలో ఎక్కువ వయసుగల క్రీడాకారుడి ఫారిడ్ మొండ్రాగన్ (కొలంబియా), 2014 జూన్ 24న జపాన్‌తో జరిగిన మ్యాచ్‌ని అతను 40 ఏళ్ల, 133 రోజుల వయసులో ఆడాడు.
నల్ల వజ్రం పీలే
ప్రపంచ ఫుట్‌బాల్ గురిం చి మాట్లాడుకుంటే- బ్రెజిల్ స్టార్ పీలేను తప్పక గుర్తుచేసుకోవాలి. అతను లేని సాకర్‌ను ఊహించడం కూడా కష్టమే. వరల్డ్ కప్‌లో ఎక్కువసార్లు ఆడిన, ఎక్కువ పర్యాయాలు టైటిల్ అందుకున్న ఆటగాడిగా పీలే నెలకొల్పిన రికార్డు చెక్కుచెదరకుండా ఉంది. అతను సభ్యుడిగా ఉన్నప్పుడు బ్రెజిల్ 1958, 1962, 1970 సంవత్సరాల్లో వరల్డ్ కప్‌ను కైవసం చేసుకుంది.
అయితే, అత్యధిక వరల్డ్ కప్ టోర్నీలో ఆడిన రికార్డు మెక్సికో వీరుడు ఆంటానియో కార్బజల్ పేరిట ఉంది. ఎక్కువ సంఖ్యలో నాటౌట్ గేమ్స్ ఆడిన ఆటగాడు మిరొస్లావ్ క్లోస్ (జర్మనీ). టైటిల్ యుద్ధాల్లో ఎక్కువ సమయం మైదానంలో ఆడిన ఆటగాడు పాలొ మాల్డినీ (ఇటలీ). 2002-2014 మధ్యకాలంలో ఇటలీ ఫైనల్స్ ఆడినప్పుడు, అతను రెండు గంటల, 217 నిమిషాలు మైదానంలో ఉన్నాడు. అత్యధికంగా 17 మ్యాచ్‌ల్లో గెలిచిన ఆటగాడిగానూ అతని పేరు రికార్డు పుస్తకాల్లో చేరింది.

వారిదే ఆధిపత్యం
ప్రపంచకప్ సాకర్‌లో కేవరం రెండు ఖండాల ఆధిపత్యమే మొదటి నుంచి ఇప్పటివరకూ కొనసాగుతోంది. దక్షిణ అమెరికా దేశాలు తొమ్మిది సార్లు ట్రోఫీని గెల్చుకోగా, ఐరోపా దేశాలు కూడా తొమ్మిది విజయాలతో సమవుజ్జీగా ఉన్నాయి. మరే ఇతర ఖండానికీ ట్రోఫీని గెల్చుకున్న ఘనత దక్కలేదు. అయితే, యూరోప్ బయట జరిగిన ఏ పోటీలోనూ యూరోప్ ప్రపంచకప్ ట్రోఫీని గెల్చుకోలేకపోవడం కొసమెరుపు.

- విశ్వమిత్ర