ఈ వారం తార

ఓడిపోయా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఎన్నోసార్లు.. ఎన్నో విధాలుగా మనం నచ్చిన వాళ్లని ప్రేమిస్తూనే వుంటాం. అయితే మన ప్రేమ సక్సెస్ అయినప్పుడే నిజమైన ఆనందం. అలాంటి ఆనందాలు ఎప్పుడూ దొరకలేదు. ప్రేమలో ఐదుసార్లు నేను ఓడిపోయా. ప్రేమించానని చెప్పిన వాళ్లందరూ చివరికి మరోదారి చూసుకోవడంతో ఐదుసార్లు ఓటిమిని ఎదుర్కొన్నాను’’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తోంది నటి లక్ష్మీరాయ్. తాజాగా ఆమె హిందీలో నటించిన ‘జూలీ-2’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తాకొట్టింది. ఈ చిత్రంలో హాట్ హాట్ అందాలను చూపించినా, ఏ మాత్రం ప్రేక్షకులు ఆస్వాదించలేదు. అందుకే ఇలాంటి కొత్త ప్రేమకథల పాఠాలు చెబుతోంది అంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. మగాళ్లందరూ చెడ్డవాళ్లని అనను కానీ, కొందరు మాత్రం ఉన్నారని చెబుతోంది. ప్రేమ లో ఓడిన ప్రతీసారీ తన గదిలో కూర్చోని ఏడ్చేదాన్నని కూడా చెప్పుకొచ్చింది. అయనా ఇవేమీ పట్టించుకోనంటూనే మనకు తెలియని ఎన్నో విషయాలను, తన మనసులో దాచుకున్న అసలు సంగతులను చెప్పకనే చెబుతోంది.