తెలంగాణ

తెలంగాణ ఎంసెట్-2 లీకేజీ నిజమే?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఎంబిబిఎస్, డెంటల్ కోర్సుల్లో ప్రవేశానికి ఇటీవల జరిగిన తెలంగాణ ఎంసెట్-2 పేపర్ లీక్ అయినట్టు సిఐడి పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ఆరు బృందాలుగా ఏర్పడిన సిఐడి పోలీసులు వివిధ ప్రాంతాల్లో ఇందుకు సంబంధించి బ్రోకర్లను, విద్యార్థులను, కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలను క్షుణ్ణంగా విచారించారు. ఇప్పటికే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు కీలక నిందితుల కోసం గాలిస్తున్నారు. పేపర్ లీకేజీ ద్వారా 30 మంది విద్యార్థులు లబ్ధి పొందినట్లు గుర్తించారు. దిల్లీలోని ప్రింటింగ్ ప్రెస్ నుంచే పేపర్ లీక్ అయినట్లు, 30 నుంచి 50 లక్షల రూపాయలకు పేపర్‌ను విద్యార్థులకు విక్రయించినట్లు తెలిసింది. హైదరాబాద్‌లో కాకుండా ముంబయి, బెంగళూరు నగరాలకు విద్యార్థులను రప్పించి పేపర్‌ను అందజేశారని సమాచారం.