తెలంగాణ

ఆంధ్రతో సమానంగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకింత ఎక్కువేగానీ తక్కువకాకుండా టి.బడ్జెట్?
నీటిపారుదలకు పెద్దపీట భగీరథ, బెడ్ రూమ్‌లకు ప్రాధాన్యత
నేడు 11.35 గంటలకు బడ్జెట్ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం

హైదరాబాద్, మార్చి 13: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర మూడవ వార్షిక బడ్జెట్‌ను సోమవారం ఉదయం 11.35 గంటలకు శాసనసభలో ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం ముహుర్తం ఖరారు చేసింది. ఈ వార్షిక (2016-17) బడ్జెట్ ప్రతిపాదనలకు ఆదివారం సాయంత్రం సచివాలయంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి ఆమోదించింది. గత ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్ కంటే రూ.21 వేల కోట్లు అధికంగా ఉండేలా బడ్జెట్‌ను రూపొందించినట్టు అధికార వర్గాల సమాచారం. గత ఏడాది బడ్జెట్ కంటే పైమొత్తం పెరుగుదలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌తో తెలంగాణ బడ్జెట్ కాస్త ఎక్కువే ఉండేవిధంగా రూపొందించినట్టు ఈ వర్గాల సమాచారం. దేశంలోనే మిగులు బడ్జెట్ కలిగిన వాటిలో గుజరాత్, తెలంగాణ రెండు రాష్ట్రాలు మాత్రమే. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్ర ఆదాయం గతంలో కంటే 15 శాతం వృద్ధి నమోదు అయింది. రెవిన్యూ వృద్ధికి అనుగుణంగా బడ్జెట్‌ను గతంలో కంటే పెంచడంతో పాటు ధనిక కావడం వల్ల కూడా పెరుగుదలకు కారణంగా అధికారులు విశే్లషిస్తున్నారు. అలాగే పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ కంటే ఒక రూపాయి ఎక్కువే కానీ తక్కువ ఉండకూడదన్న కోణంతో దీనిని రూపొందించినట్టు అధికార వర్గాల సమాచారం. ఇలా ఉండగా మార్చితో ముగియనున్న గత వార్షిక బడ్జెట్ (2015-16) రూ.1,15,689.2 కోట్లు కాగా, ఈ ఏడాది (2016-17) రూ.లక్ష 36 వేల కోట్లపై చిలుకు ఉండే అవకాశం ఉన్నట్టు విశ్వనీయ వర్గాల సమాచారం. ఈ మొత్తం బడ్జెట్ ఉంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ కంటే సుమారు వెయ్యి రూపాయాలు ఎక్కువ కానుంది. బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టే వరకు బయటికి వెల్లడించకూడదన్నది చట్టసభల నియామావళీ. అయితే బడ్జెట్ స్వరూపాన్ని ముఖ్యమంత్రి కానీ, ఆర్థికశాఖ మంత్రి కానీ ముందుగా సూచనప్రాయంగా వెల్లడించడం సర్వసాధారణమే. ఈ సారి ప్రవేశపెట్టనున్న బడ్జెట్ రూ. లక్ష 25 వేల కోట్ల నుంచి 35 వేల కోట్లకు మధ్యలో ఉంటుందని ఇది వరకే బడ్జెట్ ప్రతిపాదనల సమీక్షల్లో ముఖ్యమంత్రి పరోక్షంగా వెల్లడించారు. ఇలా ఉండగా ఈసారి బడ్జెట్ రూపకల్పనలో మూసా పద్ధతులకు ప్రభుత్వం స్వస్తి పలికింది. బడ్జెట్‌లో సాధారణంగా ప్రణాళిక వ్యయం కంటే ప్రణాళికేతర వ్యయం ఎక్కువ ఉండటం అనవాయితీగా వస్తున్న విధానం. అయితే ఈసారి బడ్జెట్‌లో ప్రణాళిక వ్యయానికి ఎక్కువ కేటాయించి, ప్రణాళికేతర వ్యయాన్ని తగ్గించడం మరో విశేషంగా చెప్పుకోవచ్చు. బడ్జెట్‌లో నీటిపారుదల రంగానికి పెద్దపీట వేయడంతో పాటు మిషన్ భగీరథ, డబుల్ బెడ్‌రూమ్, వైద్యరంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్టు సమాచారం.
(చిత్రం) కేబినెట్ సమావేశానికి వెళ్తున్న మంత్రులు పోచారం, ఇంద్రకరణ్ రెడ్డి, పద్మారావు, ఈటల రాజేందర్