కృష్ణ

నిండా మునిగిన రైతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడ్లవల్లేరు, నవంబర్ 20: వరి కోతలు కోసే సమయంలో అల్పపీడన ప్రభావంతో గత మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలతో రైతులు నిండా మునిగారు. ఆరుగాలం పండించిన రైతుకు పంట చేతికి వచ్చే తరుణంలో ముంచుకొచ్చిన ఆకాల వర్షాలు కౌలు రైతులను కోలుకోలేని దెబ్బతీశాయని వాపోతున్నారు. నేలవాలిన వరి కంకులు గత కొద్ది రోజులుగా చేలో నిలిచిన వర్షం నీటిలో నాటడంతో మొలకెత్తాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వరి చేలు నేలకు చాపలా కరుచుకుని నీటిలో నానడంతో వాటిని నిలబెట్టే పనిలో రైతులు ఉన్నారు. వరి చేలోని నీరు పంట కాలువలోకి ప్రవహించటంతో మినుము విత్తనాలు కొట్టుకుపోయాయి. దీంతో రైతులు పెట్టిన వేలాది రూపాయల పెట్టుబడి నీటిపాలైందని విలపిస్తున్నారు. ఇప్పటికే వడ్లమన్నాడు గ్రామంలో కొద్ది రోజుల క్రితం వరి కోతలు కోసిన రైతులు చేలో నుంచి పనలను రోడ్లపైకి తీసుకువచ్చి పంటను రక్షించుకునే పనిలో నిమగ్నమయ్యారు. వడ్లమన్నాడు గ్రామానికి చెందిన కాగిత రాంబాబు మూడు ఎకరాల్లో వరి సాగు చేశాడు. సాగు చేసినప్పటి నుంచి రూ.20వేలకు పైగా పెట్టుబడి పెట్టగా పంట చేతికి వచ్చే తరుణంలో వరుణుడు నిండా ముంచడంతో పంటను రక్షించుకునేందుకు వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టాల్సి వస్తోందని వాపోతున్నాడు. పనలను రోడ్లపై ఆరబెట్టేందుకు కూలీలకు అదనంగా పెట్టుబడి పెట్టాల్సి వస్తోందని వాపోయాడు. అదే గ్రామానికి చెందిన శేషం వెంకటేశ్వరరావు ఐదు ఎకరాల్లో పంటను సాగు చేయగా కోతలు కోసిన తరువాత వర్షం కురవడంతో వరి పనలు నీట మునగటంతో డీజిల్ ఇంజన్ సహాయంతో ఎకరాకు రూ.1000 చొప్పున అదనంగా ఖర్చు చేసి పంటను రక్షించుకుంటున్నాడు. వేమవరం గ్రామానికి చెందిన కౌలు రైతు దేవనబోయిన నాగకోటేశ్వరరావు ఎకరంన్నర బిపిటిని సాగు చేయగా పంట మొత్తం చాపలా వాలిపోవడంతో వరి కంకులు మొలక రావడంతో పంటపై ఆశలు వదులుకున్నానని వాపోయాడు. మండలంలో ఎక్కువ శాతం ఖరీఫ్ సాగు చేసిన కౌలు రైతులే ఉండటం గమనార్హం. ఇప్పటికే రెండు వాయుగుండాలతో అతలాకుతలమైన రైతన్నలు మరో అల్పపీడన ద్రోణి ఉందని వాతావరణ శాఖాధికారులు ప్రకటించడంతో రైతుల గుండె చెరువు అవుతుంది.

నేటి నుండి శ్రీ పాండురంగ స్వామి ఉత్సవాలు
మచిలీపట్నం, నవంబర్ 20: శనివారం ఉదయం గణపతి పూజ, గోపూజతో ఉత్సవాలతో శ్రీ పాండురంగ స్వామి ఉత్సవాలు ఘనంగా ప్రారంభించనున్నట్టు ఆలయ కమిటీ తెలిపింది. ఉత్సవాలు విజయవంతం అయ్యేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు వారు తెలిపారు. 21వ తేదీ రాత్రి సామూహిక విష్ణుసహస్రనామ పారాయణ, 22 ఉదయం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు, రాత్రి గంటలకు రుక్మిణీ పాండురంగ స్వాముల కళ్యాణం, 23 ఉదయం కైలాస మండపంలో అభిషేకాలు, రాత్రి రథోత్సవం, 24 ఉదయం లక్ష్మీగణపతి హోమం, రాత్రి సహస్ర దీపారాధన, 25 ఉదయం గోపాలకాల ఉత్సవం నిర్వహించనున్నారు.

582 బస్తాల నల్లబెల్లం స్వాధీనం
నూజివీడు, నవంబర్ 20: నల్లబెల్లం అక్రమంగా నిల్వ ఉంచిన వ్యాపారులపై దాడులు నిర్వహించి, భారీ స్థాయిలో నల్లబెల్లంను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సిఐ జె శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేఖరులతో ఆగిరిపల్లిలో యండూరు అప్పారావు ప్రభుత్వ నిబంధనల విరుద్ధంగా నల్లబెల్లం విక్రయాలు చేస్తున్నారని చెప్పారు. అప్పారావుకు చెందిన గోడౌన్‌లో దాడులు నిర్వహించగా భారీ స్థాయిలో నిల్వ చేసిన నల్లబెల్లం దొరికిందని, 582 బస్తాల నల్లబెల్లం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు అప్పారావుపై పది కేసులు నమోదయ్యాయని అన్నారు. కాపు సారాకు ఉపయోగించే నల్లబెల్లం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. నల్లబెల్లం విక్రయాలను ఏ ఒక్కరూ ప్రోత్సహించవద్దని కోరారు.

న్యూ రాజరాజేశ్వరిపేటలో కార్డన్ సెర్చ్
విజయవాడ , నవంబర్ 20: నేరస్థుల కదలికల నేపథ్యంలో ఇటీవల జరుగుతున్న చోరీల క్రమంలో సెంట్రల్ ఎసిపి ఆదేశాల ప్రకారం అజిత్‌సింగ్‌నగర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ బాల మురళీకృష్ణ శుక్రవారం ఉదయం స్థానిక న్యూ రాజరాజేశ్వరీపేటలోని జి ప్లస్ త్రీ గృహ సముదాయంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రతి ఇంటికీ వెళ్లి గృహస్థుల వివరాలను పరిశీలించారు. వారి గుర్తింపు కార్డులతోపాటు ఇతర నేర చరిత్రపై విచారణ చేపట్టగా పలువురు పాత నేరస్థులతోపాటు వివిధ కేసుల్లో నిందితులుగా ఉండి తప్పించుకుని తిరుగుతున్న పలువురిని గుర్తించి వారిని అదుపులోకి తీసుకొన్నారు. ఈ తనిఖీల్లో 521 మందిని విచారించగా ఇందులో 13 మంది వివిధ కేసుల్లో నిందితులుగా తేలారు. కాగా ఐదుగురు పాత నేరస్థులుగా నిర్థారించారు. వీరి నుంచి ఒక ఆటో, 3 బైకులను స్వాధీనం చేసుకొన్నారు. తనిఖీల సందర్భంగా ఏరియా మొత్తాన్ని చుట్టుముట్టి పోలీసులు చేసిన హడావుడితో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.