తెలంగాణ

ఫీజులు తగ్గించమంటే.. టీసీలు ఇచ్చేశారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: అధిక ఫీజులు తగ్గించాలని తాము అడిగితే స్కూల్ యాజమాన్యం 27 మంది విద్యార్థులకు టీసీలు ఇచ్చి ఇళ్లకు పంపేసిందని తల్లిదండ్రులు ఆందోళన ప్రారంభించారు. సికింద్రాబాద్ మహేంద్రహిల్స్‌లో మాతా అమృతానందమయి స్కూల్ వద్ద బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఫీజులు తగ్గించాలంటూ కొద్ది రోజుల క్రితం తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్య ప్రతినిధులను కలిసి విజ్ఞప్తి చేశారు. ఆ సందర్భంగా వాగ్వివాదం చోటు చేసుకుంది. దానిని దృష్టిలో పెట్టుకుని 27 మంది విద్యార్థులకు టీసీలు ఇవ్వడం అన్యాయమని పేరెంట్స్ ఆవేదన చెందుతున్నారు. వీరి ఆందోళనకు పలు ప్రజాసంఘాలు మద్దతు ప్రకటించాయి.