కృష్ణ

ముంచుకొస్తున్న గడువుకాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 13: మరికొద్ది రోజుల్లో 2015-16 ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న ప్రస్తుత తరుణంలో నగర పాలకులు ప్రజల వద్ద నుంచి వసూలు చేయాల్సిన పన్నుల వసూళ్లపైనే దృష్టిసారిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న వసూలు తతంగాన్ని పరిశీలిస్తే సామాన్యులపై తెస్తున్న ఒత్తిడిలు భారీ స్థాయిలో బకాయిలు పడ్డా పెద్దోళ్ల జోలికెళ్లడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా అమృత్ పథకం అమలు పరిధికి రాబోతున్న విజయవాడ నగరంలో ఆ పథకం నియమం ప్రకారం నూరు శాతం పన్ను వసూలు చేయాల్సి ఉంది. ఆ దిశగా లక్ష్య సాధనకు అడుగులేసిన విఎంసి అధికరణం అందుకనుగుణంగా సిబ్బంది సహకరించడం లేదన్న విమర్శలు వాదనలు వినిపిస్తున్నాయి. పన్ను వసూలుతో విఎంసి ఆర్థిక పరిపుష్టి పొందడమే కాకుండా అమృత్, స్మార్ట్‌సిటీ పథకాలకు తగు అర్హత సాధించడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల నిధులను పుష్టిగా పొందాలన్న యోచనతో పౌర సేవలను కూడా కాదని విఎంసికి చెందిన రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, ప్రజారోగ్య విభాగాలకు చెందిన సిబ్బందితో ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసిన కమిషనర్ వీరపాండియన్ ఆలోచనలకు అనుగుణంగా సిబ్బంది మాత్రం స్పందించకపోవడం గమనార్హం కాగా రోజు వారీ విధులు కాకుండా ఆదాయం మెరుగు పేరుతో పన్ను వసూలుకు తమను ఇతర సేవలకు వినియోగించడం సహేతుకం కాదంటూ టౌన్ ప్లానింగ్, ప్రజారోగ్య శాఖల సిబ్బంది బహిరంగంగానే పెదవి విరుస్తున్న వైనం వాస్తవానికి పన్ను వసూలు విధులు రెవెన్యూకు చెందిన బిల్ కలెక్టర్లు, ఇన్‌స్పెక్టర్లు నిర్వర్తింస్తుంటారు. అయితే సాధారణంగా వసూలు అయ్యే పన్నులే కాకుండా దీర్ఘకాలికంగా బకాయిపడ్డ పన్నుల వసూలుకు నగర పాలకులు ఈ ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసి సెలవు దినాల్లో కూడా వసూలు చేపట్టాలని నిర్ణయించారు.
ఇదిలా ఉండగా విఎంసి పరిధిలో ఆస్తి పన్నులకు సంబంధించి లక్షా 79వేల 245 ఆసిస్‌మెంట్లు ఉన్నాయి. వీటికి సంబంధించి వార్షిక డిమాండ్ 80 కోట్ల 65లక్షల 28వేల 571 రూపాయలు కాగా ఇప్పటివరకూ 75 కోట్ల 74 లక్షల 81వేల 770 రూపాయలు ఈనెల 11నాటికి వసూలు కాగా ఇంకా 4 కోట్ల 90లక్షల 46వేల 801 రూపాయలు వసూలైనట్లు అధికారిక రికార్డులే తెలుపుతున్నాయి. మొత్తంగా చూసుకొంటే వసూలు శాతం 93.92గా ఉంది. అలాగే వేకెండ్ ల్యాండ్ టాక్స్ వసూలు సంబంధించి నగర వ్యాప్తంగా 14వేల 915 అసిస్‌మెంట్లు ఉండగా వార్షిక డిమాండ్ 58కోట్ల 39లక్షల 50వేల 480 లు కాగా ఇప్పటివరకూ కేవలం 7కోట్ల 72లక్షల 37వేల 13రూపాయలను మాత్రమే వసూలై ఇంకా 50కోట్ల 67లక్షల 13వేల 467 లు వసూలు కావాల్సి ఉంది. దీని వసూలు శాతం కేవలం 13.23శాతంగానే ఉండటం గమనార్హం. మంచినీటి సరఫరాకు చెందిన కనెక్షన్ల సంఖ్య లక్షా 6వేల 979 ఉండగా వార్షిక డిమాండ్ 28కోట్ల 16లక్షల 48వేల 355 రూపాయలు కాగా ఇప్పటివరకూ 20కోట్ల 65లక్షల 45వేల 320 లు వసూలై ఇంకా 7కోట్ల 51లక్షల 3వేల 35 రూపాయలను వసూలు చేయాల్సి ఉంది. యుజిడి కనెక్షన్ల సంఖ్య పరిశీలిస్తే నగర వ్యాప్తంగా కేవలం 65వేల 988 మాత్రమే ఉండగా దీని వార్షిక డిమాండ్ 9కోట్ల 45లక్షల 12వేల 116 రూపాయలు కాగా ఇప్పటివరకూ 7కోట్ల 76లక్షల 54వేల 820 లు వసూలు కాగా ఇంకా కోటి 68లక్షల 57వేల 296 రూపాయలు వసూలు కావాల్సి ఉంది. మొత్తంగా చూసుకొంటే విఎంసికి ఆయా పన్నుల రూపంలో 3లక్షల 67వేల 127 డిమాండ్లకు గాను వార్షిక ఆదాయం 176 కోట్ల 66లక్షల 39వేల 522 రూపాయలకు గాను ఇప్పటివరకూ 111కోట్ల 89లక్షల 18వేల 923 రూపాయలు వసూలు కాగా ఇంకా 64 కోట్ల 77లక్షల 20వేల 599 రూపాయలుగా ఉండి మొత్తం వసూలు శాతాన్ని పరిశీలిస్తే 63.34 శాతంగా ఉండటం గమనార్హం. ఈ వసూలును ఈనెలాఖరులోగా నూరు శాతంగా వసూలు చేయించాలన్న నగర పాలకుల లక్ష్యానికి సిబ్బందే తూట్లు పొడుస్తున్నారన్న విషయం వేరే చెప్పనక్కర్లేదు. అయితే నూరు శాతం వసూలు కాకపోతే పరిస్థితి ఏమిటన్న విషయంపై అధికార సిబ్బందిలో ఆందోళన లేకపోలేదు గానీ వసూలు బాధ్యతలప్పగింతపై ఇతర విభాగాలకు చెందిన సిబ్బంది మాత్రం అంతంతగానే స్పందిస్తున్నారన్న విమర్శలకు కొదవలేదు. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ చెందిన సిబ్బంది ఆవేదన అంతా ఇంతా కాదు. ఒకపక్క ఆన్‌లైన్ ప్లాన్ల మంజూరు అమలులో ఉన్న ప్రస్తుత తరుణంలో ఆ బాధ్యతలే భారమనుకొంటే పన్ను వసూలు విధులు కూడా అప్పగించి మరింత భారం మోపడం హేమని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్లాన్ల కోసమే కాకుండా ఇతర పనీపాటల నిమిత్తం టౌన్ ప్లానింగ్ సెక్షన్‌కు విచ్చేస్తున్న పౌరులకు బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లు, చైన్‌మెన్లు అందుబాటులో లేక తీవ్ర అసౌకర్యానికి గురవ్వడమే కాకుండా గంటల తరబడి నిరీక్షిస్తున్న వైనం సర్వసాధారణంగా కనిపిస్తోంది. ప్రత్యేక టీమ్‌ల ఏర్పాటు వలన పన్ను రెవెన్యూ వసూలులో ఎంటువంటి వృద్ధి కనిపించకపోగా పౌర సేవలకు తీవ్ర విఘాతం కలుగుతోందన్న వాదనలు వినిపిస్తున్న తరుణంలో నగర పాలకులు ఏయే చర్యలు తీసుకొంటారన్నది వేచి చూడాల్సిందే.