అక్షరాలోచన

గెలుపు అనివార్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తీగ పట్టుకొని
డొంక-
లాగేద్దామనుకుంటాను
కానీ...
ప్రయత్నించిన ప్రతిసారీ
నేనే...
డొంకల్లో చిక్కుకుపోతుంటాను

వెంట్రుకతో
కొండని-
కాజేద్దామనుకుంటాను
కానీ...
వెంట్రుక విసరబోయి
కొండ కిందున్న
రాయి - పిక్కలు జారి
బోర్లా పడుతుంటాను.
ఒక్క ఉదుటున
సముద్రాన్ని-
ఈదేయాలనుకుంటాను కానీ,
ఎగసిపడే అలలను చూసి
ఆగిపోతుంటాను

అందరినీ మించిన
గొప్ప ఆలోచనలు
చేయగలుగుతుంటాను కానీ
కార్యం
మధ్యలో ఆగిపోతుందేమోనని,
ఆ ఆటంకాలను
అధిగమించడం కోసమే
నిత్యం
ఆలోచిస్తూ... ఉంటాను.

- గగనం శ్రీనుకుమార్, 8008262514