తెలంగాణ
ఆరేళ్ల బాలికపై టీచర్ లైంగికదాడి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 22 February 2016
మెదక్: ఆరేళ్ల బాలికపై వ్యాయామ ఉపాధ్యాయుడు లైంగిక దాడికి పాల్పడ్డాడని తెలియడంతో విద్యార్థులు, గ్రామస్థులు పాఠశాలలో విధ్వంసానికి దిగిన ఘటన మెదక్ జిల్లా మిరుదొడ్డి మండలం అక్బర్‌పేటలో సోమవారం జరిగింది. స్థానికుల కథనం మేరకు- సోమవారం ఉదయం గ్రామంలోని ఓ ప్రైవేటు స్కూల్లో ఆరేళ్ల బాలికను వ్యాయామ ఉపాధ్యాయుడు కుమార్ ఓ గదిలోకి తీసుకుపోయి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక కేకలు వేయడంతో విద్యార్థులు అక్కడికి చేరుకుని జరిగిన విషయాన్ని ప్రిన్సిపాల్‌కు తెలిపారు. బాలికను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాక, గ్రామస్థులు పాఠశాలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి, రెండు స్కూల్ బస్సులకు నిప్పు పెట్టారు. పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.