కృష్ణ

ఎక్స్‌ప్రెస్ హైవేకి భూములిచ్చేది లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడికొండ, మే 3: అమరావతి - అనంతపురం ఎక్స్‌ప్రెస్ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వానికి తమ భూములను ఇవ్వలేమని, ఎన్‌టిఅర్ హయాంలో కొండవీటి వాగు కోసం తీసుకున్న భూములకు నేటి వరకు నష్టపరిహారం అందించలేదని అవేదన వ్యక్తం చేశారు. బుధవారం మండల పరిధిలోని లాం పంచాయతీ కార్యాలయంలో రెవెన్యూ సర్వే అధికారులు రైతులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ అనిల్ మాట్లాడుతూ మండల పరిధిలోని లాం, బండారుపల్లి, తాడికొండ, పొనె్నకల్లు ఎక్స్‌ప్రెస్ హైవే కోసం భూములను తీసుకోవలసి వస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ రైతు వెంగళశెట్టి సత్యన్నారాయణ మాట్లాడుతూ కొండవీటి వాగు వలన పది అడుగుల నీరు నిల్వ ఉంటుందని, సిఅర్‌డిఎ అధికారులు కొండవీటి వాగు రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్లు ప్రతిపాదించారని, దాని ద్వారా రాజధానికి తాగునీరును అందించాలనే ఉద్దేశం ఉన్నదన్నారు. అదే ప్రాంతంలో ఎక్స్‌ప్రెస్ హైవే కోసం ప్రభుత్వం 200 మీటర్లు వెడల్పులో ఆరు లైన్ల రోడ్డును, అందులోనే రైల్వే లైను వేస్తుందని చెబుతున్నారన్నారు. రిజర్వాయర్ పైన రోడ్డు వేస్తారా? ఒకే ప్రాంతంలో ఇవన్నీ చేస్తారా? అని రైతులు అడిగిన ప్రశ్నకు తహశీల్దార్ అనిల్‌కుమార్ సమాధానం చెప్పలేకపోయారు. మరో రైతు ఆళ్ళ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఒక్క లాం గ్రామంలోనే సుమారు 140 ఎకరాలు భూమి పోతుందని, దానిలో నా పొలం 10 ఎకరాలు ఉన్నదని, ప్రభుత్వం ఎక్స్‌ప్రెస్ హైవే రోడ్డు నిర్మాణం వలన నా 9 ఎకరాల భూమిని ప్రభుత్వానికి ఇవ్వవలసి వస్తుందని అన్నారు. నా కుమార్తెకు మంచి సంబంధం వచ్చిందని, ఈ సంబంధం వారికి కట్నం కింద ఈ పొలాన్ని ఇచ్చేందుకు హామీ ఇచ్చామన్నారు. కాని అధికారులు వచ్చి మీ పొలం భూ సేకరణలో పోతుందని , ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పడంతో ఏమి చేయాలో అర్ధం కావడం లేదని కన్నీటి పర్యంతం అయ్యారు. మరో రైతు పాటిబండ్ల వెంకటప్పయ్య మాట్లాడుతూ నా వయస్సు 84 సంవత్సరాలు మా తండ్రి నాకు 30 ఎకరాల భూమిని అప్పగించారు. ఎన్‌టిఅర్ హయాంలో కొండవీటి వాగు నిర్మాణం కోసం కొంత భూమిని ప్రభుత్వం తీసుకున్నది, కాని నేటి వరకు ప్రభుత్వ నష్ట పరిహారం అందించలేదు. నా భూమిని నాప్రాణం పోయేవరకు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. ఏ జివో ప్రకారం భూములను తీసుకుంటున్నారో తెలియజెప్పాలని అధికారులను రైతులు నిలదీశారు. అదేవిధంగా కొండవీటి వాగు మీద రిజర్వాయర్ కడతామని ఇరిగేషన్ అధికారులు, రోడ్లు నిర్మాణం చేస్తామని మరో శాఖ అధికారులు ఎవరికి వారు తమ పనులు తాము చేసుకుపోతున్నారు తప్ప అధికారుల మధ్య పరస్పర సహకారం ఉన్నట్టు కనపడటం లేదన్నారు. ప్రభుత్వం భూసేకరణ చెయ్యాలంటే రైతులకు ఉపాధి చూపించాలని లేకుంటే భూమిపై ఆధారపడి జీవనం సాగించే వారి కుటుంబాలు రోడ్డున పడుతాయని అన్నారు. రైతులకు ఎకరానికి ఎంత నష్ట పరిహారం ఇస్తారు? ఎప్పటిలోగా ఇస్తారు? ఎలా ఇస్తారు? అనే ప్రశ్నలకు ఉన్నతాధికారుల దగ్గర నుండి ఖచ్చితమైన సమాచారం ముందు మీరు తెలుసుకొని అప్పుడు రైతుల వద్దకు రావాలని రైతులు సూచించారు. అంతేకాక ఈ ప్రభుత్వంపై మాకు నమ్మకం లేదని, అధికారులు ప్లగ్ మార్కింగ్ ఇస్తే ఎట్టి పరిస్థిలలో భూసేకరణ జరగనీయమని తేల్చి చెప్పారు. అంతేకాక లాం గ్రామం గుంటూరుకు అతి దగ్గరలో ఉండటం వలన ఇక్కడ భూములకు విలువ కోట్ల రూపాయల్లో ఉందని, తమ భూములను ప్రభుత్వానికి ఇస్తే, మా జీవనోపాధి ఎవౌతుందని, మేము చచ్చే వరకు మా భూములను ప్రభుత్వానికి ఇచ్చేది లేదని అధికారులకు తెలిపారు. తహశీల్దార్ అనిల్‌కుమార్ మాట్లాడుతూ రైతుల అభిప్రాయాలను తమ ఉన్నాతాధికారులకు, ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళతామని అన్నారు. కార్యక్రమంలో అర్‌ఐ కోటేశ్వరావు, సర్వేయర్ జయరాజు, ఎంపీటిసీ సైఫుద్దీన్, వీఆర్వోలు శాంతి, సైదా, రైతులు పాల్గొన్నారు.
గుండె పోటుతో కౌలు రైతు మృతి
దుర్గి, మే 3: గుండె పోటుతో కౌలు రైతు మృతి చెందిన సంఘటన మండలంలోని ఓబులేశునిపల్లె గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. బంధువులు, కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం గ్రామానికి చెందిన తురకా అంజయ్య (47) గత మూడు సంవత్సరాలుగా ఎనిమిది ఎకరాలు కౌలుకు తీసుకుని పోలంలో మిర్చి, పత్తి సాగుచేస్తున్నాడు. గడచిన రెండు సంవత్సరాలు పంటల దిగుబడి లేక అప్పులపాలైనాడు. ఈ ఏడాది కూడా నాలుగు ఎకరాల మిర్చి, రెండు ఎకరాల పత్తి, మరో రెండు ఎకరాల్లో కంది సాగుచేశాడు. మృతుడు అంజయ్య ఆశించిన మేర దిగుబడి లేకపోవడం, గిట్ట్ధుర లేకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. అప్పుల భారం అధికం కావడంతో, చేసిన అప్పులు తీర్చే మార్గం లేక దిక్కుతోచని స్ధితిలో అంజయ్య మానసికంగా కృంగి, గత కొన్ని రోజుల నుండి అనారోగ్యం పాలైనాడు. ఈ క్రమంలో అంజయ్య మంగళవారం పొలం వెళ్ళి తిరిగి ఇంటికి చేరుకుని, అకస్మాత్తుగా కళ్ళు తిరిగి కుప్పకూలి, గుండెపోటుతో మృతి చెందాడు. మృతునికి భార్య, ముగ్గురు సంతానం ఉన్నారు.
రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి
వినుకొండ, మే 3: రోడ్డు దాటుతూ ఉండగా వాహనం ఢీకొని వృద్దుడు మృతి చెందిన సంఘటన స్ధానిక ఆర్టీసీ డిపో సమీపంలో జరిగింది. మృతుడు చలమయ్య (65) వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రిలో ఉంచారు. బుధవారం శవపంచనామా అనంతరం బంధువులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.