తెలంగాణ

హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగరంలో గురువారం మధ్యాహ్నం నుంచి అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షం కురుస్తోంది. గురు, శుక్రవారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరికలకు అనుగుణంగానే భారీ వర్షం నగరాన్ని వణికిస్తోంది. ఖైరతాబాద్‌, లక్డీకాపూల్‌, పంజాగుట్ట, అమీర్‌పేట, బేగంపేట, సికింద్రాబాద్‌, అల్వాల్‌, జీడిమెట్ల, ఎర్రగడ్డ, సనత్‌నగర్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, నాంపల్లి, హబ్సిగూడ, నారాయణగూడ, హిమాయత్‌నగర్‌, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఇప్పటికీ నగరంలోని అనేక కాలనీలు, బస్తీలు వరదనీటిలోనే నానుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మళ్లీ వర్షం మొదలుకావడంతో వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.