రంగారెడ్డి

నకిలీ మందుల తయారీ స్థావరాలపై ఎస్‌ఓటి పోలీసుల దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, జూలై 2: రామంతాపూర్ టివికాలనీలోని రహస్య ప్రదేశంలో అనుమతి లేకుండా నకిలీ మందులను తయారు చేస్తున్న స్థావరాలపై సైబరాబాద్ స్పెషల్ పోలీసు టీం (ఎస్‌ఓటి) బృందం శనివారం సాయంత్రం ఆకస్మిక దాడిచేసి బాధ్యులైన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద రూ.10లక్షల విలువైన పేరున్న కంపెనీల నకిలీ మందులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ రాములు తెలిపారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేకుండా పేరున్న కంపెనీల లేబుల్స్‌తో తయారీ చేస్తూ అధిక ధరలకు విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని అందిన సమాచారం మేరకు దాడి చేసి జి.శ్రీరాములు, వెంకట నారాయణ, గంగాధర్‌లను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు నిమిత్తం ఉప్పల్ పోలీసులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.

అసదుద్దీన్‌ను
అరెస్ట్ చేయాలి
శేరిలింగంపల్లి, జూలై 2: ఉగ్రవాదులకు న్యాయ సహాయం చేస్తానంటున్న ఎంపి అసదుద్దీన్ ఒవైసీని దేశద్రోహం కింద అరెస్ట్ చేయాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కసిరెడ్డి భాస్కర్‌రెడ్డి డిమాండ్ చేశాడు. దేశంలో, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో దాడులకు పాల్పడాలని కుట్ర పన్నిన తీవ్రవాదులకు న్యాయసహాయం చేయడం చట్ట విరుద్ధమని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పక్కా ఆధారాలతో నేషనల్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ అరెస్ట్ చేసిన ఉగ్రవాదులకు ఎంఐఎం పార్టీ మద్దతు తెలపడం దేశద్రోహం అన్నారు. వెంటనే ఎంఐఎం పార్టీని నిషేధించి ఎంపి అసదుద్దీన్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దేశద్రోహి, మతతత్వ మజ్లిస్ పార్టీకి మద్దతుగా వ్యవహరిస్తున్న టిఆర్‌ఎస్ పార్టీ ఈ విషయంలో తన వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదులకు సహాయం చేసే ఏ పార్టీనైనా ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.