తెలంగాణ

అంచనాలు తప్పిన ఆదాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆశించింది 31శాతం..సాధించింది 10శాతం

నోట్ల రద్దు, భూముల అమ్మకం జరుగకపోవడమే కారణం
తగ్గిన ఆదాయంతో మిగులు బడ్జెట్ సాధ్యమేనా?

హైదరాబాద్, మార్చి 5: పెద్దనోట్ల రద్దు ప్రభావం రాష్ట్రంపై పెద్దగా ఉండదని అధికారులు వేసిన అంచనా లెక్క తప్పింది. ప్రస్తుత బడ్జెట్‌లో రాష్ట్ర ఆదాయం 30.3 శాతం పెరుగుదల ఉంటుందని అంచనా వేయగా 10 శాతం మాత్రమే పెరుగుదల కనిపించింది. దీంతో ప్రభుత్వానికి రావలసిన ఆదాయం సుమారు 20శాతం తగ్గింది. ఈ నెల 13న శాసనసభలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రతిపాదించనున్న విషయం తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.1,30,416 కోట్ల అంచనాతో బడ్జెట్ ప్రవేశపెట్టగా, అందులోనుంచి అప్పులు రూ.25,580 కోట్లు మినహాయించి రూ.1,04,849 కోట్లతో ప్రతిపాదించింది. ఇప్పుడు ఆదాయం 20 శాతం మేర తగ్గడంతో రూ.1,10,000 కోట్లకు సవరించాల్సిన పరిస్థితి ఏర్పడినట్టు అధికార వర్గాలు లెక్క కడుతున్నాయి. నిరుడు కూడా ఇప్పటిలాగే ఆదాయం 13 శాతం తగ్గింది. 2015-16లో 96వేల కోట్ల ఆదాయం వస్తుందని లెక్కలు వేసుకోగా, రూ.79,835 కోట్లు మాత్రమే రావడంతో 13శాతం కోత పడింది. అలాగే ఈ ఏడాది రూ.80 వేల కోట్లు బడ్జెట్ దాటక పోవచ్చని లెక్కతేలింది. ద్రవ్యలోటు రూ.20వేల కోట్ల నుంచి 24 వేల కోట్ల మధ్య ఉండే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. వృద్ధి రేటు పది శాతం మించకపోవటానికి ప్రధాన కారణం నోట్ల రద్దేనని అంటున్నారు. నోట్ల రద్దు వల్ల స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్‌తో పాటు ఎక్సైజ్, రవాణాశాఖల ఆదాయం తగ్గడం ముఖ్య కారణమని విశే్లషిస్తున్నారు. దీంతో పాటు రాష్ట్రంలో ప్రభుత్వ నిరర్థక భూములను విక్రయించడం ద్వారా రూ.11 వేల కోట్లు సమీకరించుకోనున్నట్టు ప్రస్తుత బడ్జెట్‌లో ప్రతిపాదించింది. అయితే కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడంతో ప్రభుత్వ భూముల అమ్మకంపై దృష్టి సారించక పోవడంతో కనీసం వెయ్యి కోట్లు కూడా సమీకరించుకోలేకపోయింది. పైగా కొత్త జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాల సముదాయాల నిర్మాణంతో పాటు అనేక కార్యక్రమాలకు ప్రభుత్వ భూములు అవసరం అవుతాయని కలెక్టర్లు ప్రభుత్వానికి సూచించారు. దీంతో భూముల విక్రయం జరుగకపోవడం, నోట్ల రద్దు వల్ల ఆదాయం తగ్గడం వంటి కారణాల వల్ల అనుకున్న లక్ష్యం మేరకు ఆదాయం సమకూరకపోవడానికి కారణంగా ఆర్థికశాఖ వర్గాలు విశే్లషిస్తున్నాయి. ఇలాఉండగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాటి నుంచి మిగులు బడ్జెట్ కలిగిన రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఈ సారి ప్రవేశ పెట్టబోయే బడ్జెట్‌లో మిగులు ఉంటుందా? లేదా అనేది సందిగ్ధంలో పడింది.