కృష్ణ

సముద్ర నాచు సాగుకు మత్స్యకారులను ప్రోత్సహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఏప్రిల్ 18: మత్స్యకారులను సీవీడ్ (సముద్ర నాచు) సాగు చేసే విధంగా ప్రోత్సహించాలని జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ అధికారులను ఆదేశించారు. మంగళవారం తన ఛాంబర్‌లో మత్స్య శాఖ, డ్వామా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేపల వేట నిషేధ కాలంలో ప్రభుత్వం మత్స్యకారులకు రూ.4వేలు చొప్పున జీవన భృతి అందిస్తుందని, దీన్ని త్వరితగతిన మత్స్యకారుల బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే నిషేధ కాలంలో మత్స్యకారులను సివీడ్ కల్చర్ సాగు చేసే విధంగా ప్రోత్సహించాలన్నారు. బందరు జెడ్పీటిసి లంకే నారాయణ ప్రసాద్ మత్స్యకారులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను లేవనెత్తారు. జిల్లా మత్స్యకార సహకార సంఘ సమావేశాన్ని నిర్వహించాలన్నారు. 50 శాతం సబ్సిడీపై వలలు, సైకిళ్లు, మోపెడ్లు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. చాలా చోట్ల చేపల చెరువులకు వెళ్లేందుకు అప్రోచ్ రోడ్లు లేక మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారని, ఉపాధి హామీ పథకం కింద అప్రోచ్ రోడ్లు నిర్మించాలని కోరారు. కలిదిండి జెడ్పీటిసి రమాదేవి మాట్లాడుతూ మండల సమావేశాలు, ఆత్మ సమావేశాలకు మత్స్య శాఖాధికారులు గైర్హాజరవుతున్నారన్నారు. మత్స్యకార సొసైటీలతో సమావేశాలు నిర్వహించి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. సముద్ర మొగ పూడిక తీయించాలని, ఫిషింగ్ హార్బర్ పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవడానికి చర్యలు తీసుకోవాలని బందరు జెడ్పీటిసి లంకే అధికారులను కోరారు. దీనిపై స్పందించిన చైర్‌పర్సన్ అనూరాధ ప్రజా ప్రతినిధుల సూచనలు, సలహాల మేరకు అధికారులు పనులు చేయాలన్నారు. ఉపాధి హామీ పథకం కింద కూలీలకు నిర్దేశించిన లక్ష్యాల మేరకు పనులు కల్పించాలన్నారు. చెక్ డ్యామ్‌లు, మైనర్ డ్రైన్స్, చెరువుల పూడిక తీత పనులు వేసవిలో పూర్తి స్థాయిలో చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ డెప్యూటీ సిఇఓ కృష్ణమోహన్, మత్స్య శాఖ జెడి కోటేశ్వరరావు, డ్వామా పిడి బి రాజగోపాలరావు, డ్వామా ఎపిడి జ్యోతిబసు తదితరులు పాల్గొన్నారు.

మీకోసం అర్జీపై డ్వామా అధికారులు విచారణ
నందివాడ, ఏఫ్రిల్ 18: తమిరిశ గ్రామంలోఉపాధిహామీ పథకం ద్వారా పనులు చేయించుకుని డబ్బు ఇవ్వలేదని జిల్లాకలెక్టర్ కార్యాలయంలో జరిగిన మీ కోసంలో నూకరాజు అనే వ్యక్తి సోమవారం ఫిర్యాదు చేశారు. మంగళవారం ఈ ఫిర్యాదు మేరకు జిల్లా డ్వామా అధికారులు విజిలెన్స్ అధికారి సుభాషిణి, ఏపిడిఓ హేమంత్ కుమారి తమిరిశ గ్రామానికి వెళ్లి విచారణ చేశారు. ఇక్కడ జాబ్ కార్డుల్లో పేరు ఉన్న వాళ్ళు కాకుండా వేరేవాళ్లు పనిచేశారని, దీని వల్ల జాబ్‌కార్డులో పేరు ఉన్నవాళ్ల బ్యాంక్ ఖాతాలో డబ్బు జమయినట్టు అధికారులు చెబుతున్నారు. అలాగే కొంతమంది కూలీలకు ఆధార్ కార్డు లింక్ అయిన బ్యాంక్ ఖాతాలో డబ్బు జమయిందన్నారు. దీంతో టెక్నికల్ సమస్యలు కూలీలకు సరిగా అర్థంకాకపోవడంతో ఈ గ్రామంలో సమస్యలు వచ్చినట్టు చెబుతున్నారు. దీనిలో టెక్నికల్ అసిస్టెంట్‌ల నిర్లక్ష్యం కూడా ఉందంటున్నారు. దీనిపై రికార్డులు పూర్తిగా పరిశీలించి సంబంధిత ఉన్నతాధికారులకు పూర్తివాస్తవాలతో నివేదికలు అందజేస్తామని తెలిపారు. అనంతరం సమస్యను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ కె.సువర్ణరాజు, ఏపిఓ దేవానందరాజు, టిక్నికల్ అసిస్టెంట్ సత్యనారాయణ, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా జెడ్పీ పాఠశాల వార్షికోత్సవం
మోపిదేవి, ఏప్రిల్ 18: మండల పరిధిలోని కోసూరువారిపాలెం జెడ్పీ ఉన్నత పాఠశాల వార్షికోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎంపిపి ఎం జయలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వ విద్య, ప్రైవేటు విద్య తదితర అంశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులకు బహుమతులను గ్రామ ట్రస్టీ కోసూరు లక్ష్మణస్వామి, కెసిపి కన్వీనర్ శాంతి స్వరూప్, పాఠశాల ఎస్‌ఎంసి చైర్మన్ కోసూరు వెంకటేశ్వరరావు అందచేశారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం బి వెంకటాచలం, ఉపాధ్యాయులు వి సాంబశివరావు, రవీంద్ర కుమార్, మండల టిడిపి అధ్యక్షుడు శీలం శ్రీరాములు, ఎంపిటిసి సభ్యుడు హనుమాన్ ప్రసాద్, గ్రామ సర్పంచ్ వి పోతురాజు, కోసూరు సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.