నల్గొండ

ఇంటర్మీడియట్ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించాలి: ఆర్‌ఐవో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ టౌన్, ఫిబ్రవరి 26: ఇంటర్మీడియట్ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని ఆర్‌ఐవో ప్రకాశ్‌బాబు సూచించారు. శుక్రవారం పట్టణంలోని లెక్చరర్స్ భవన్‌లో సిఎస్‌ఎస్, డివోఎస్ మరియు కస్టోడియన్స్‌లతో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై అవగాహన, శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరీక్షలు నిర్వహించే సెంటర్లలో పరీక్షల సమయంలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పాటించాల్సిన ప్రవర్తనా నియమావళి, సమయానికి అనుగుణంగా బస్సు సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంతరాయంలేని విద్యుత్ సరఫరా, పరిక్షా గదులలో ఏర్పాటు చేయాల్సిన కనీస వసతులు, పరీక్షా జాగ్రత్తగా సెంటర్లకు పేపర్లు తెప్పించడం,తరలించే విధానం, విద్యార్థులకు కల్పించాల్సిన వౌళిక వసతులైన మంచినీరు, ప్రధమ చికిత్సా ఏర్పాట్లపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్ ఆదిరెడ్డి, నర్సిరెడ్డి, నాగేశ్వర్‌రావు, అంజయ్య, లక్ష్మీనారాయణ, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

వ్యవసాయ మార్కెట్‌కు...సోలర్ విద్యుత్ వెలుగులు
* చౌటుప్పల్‌లో మోడల్ ప్రాజెక్టు
* పూర్తి చేసుకున్న నిర్మాణాలు
* మంత్రి హారీష్‌రావు చేతుల మీదుగా ప్రారంభానికి ఏర్పాట్లు
* ఆకర్షిస్తున్న ఎద్దుల బండి, రైతు కుటుంబం ప్రతిమ
చౌటుప్పల్, ఫిబ్రవరి 26: చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ యార్డులో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మాణం చేసిన గోదాం పైకప్పుపై ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ వెలుగులు జిమ్ముతుంది. తెలంగాణలో మోడల్ ప్రాజెక్టుగా చేపట్టిన సోలార్ విద్యుత్ ప్రయోగం విజయవంతమైంది. ఉన్నతాధికారులు దగ్గరుండి సోలార్ విద్యుత్ పనితీరును పరిశీలించారు. ప్రయోగాత్మకంగా మార్కెట్ యార్డులో గురువారం రాత్రి సోలార్ విద్యుత్‌ను వినియోగించి వెలుగులు నింపారు. తెలంగాణలో అధికారులు చేసిన తొలి ప్రయోగం సక్సెస్ కావడంతో అధికారులు ఆనందోత్సవాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్ యార్డులను ఆధునీకరించేందుకు అధిక ప్రాధాన్యతనిస్తూ నిధులు విడుదల చేసింది. అందులో భాగంగా చౌటుప్పల్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో రూ.3 కోట్లతో 5వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కల్గిన గోదాంను నిర్మించారు. నిర్మాణం పనులు పూర్తి జరిగాయి. వ్యవసాయ మార్కెట్ యార్డులోని పాత షెడ్‌లను ఆధునీకరించారు. రైతు విశ్రాంతి భవనం నిర్మించారు. ప్రహరీ గోడలను రంగులతో అందంగా తీర్చిదిద్దారు. మొక్కలను పెంచేందుకు చర్యలు చేపట్టారు. మార్కెట్ ప్రధాన ద్వారాన్ని అందంగా నిర్మించారు. ఎద్దుల బండితో రైతు కుటుంబం ప్రతిమ పలువురిని ఆకర్షిస్తోంది. రైతులకు అవసరమైన నీటి వసతికి చర్యలు తీసుకున్నారు. గోదాం నిర్మాణం పూర్తి చేసుకోవడంతో సౌర విద్యుత్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు. గోదాం పైకప్పుపై రూ.20 లక్షలతో సౌర విద్యుత్ ప్యానల్స్ ఏర్పాటు చేశారు. 9 కిలోవాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు వీలుగా ప్యానల్స్ ఏర్పాటు చేశారు. వ్యవసాయ మార్కెట్ అవసరాలకు పూర్తి స్థాయిలో సౌర విద్యుత్‌ను వినియోగించనున్నారు. మిగిలిన విద్యుత్‌ను విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సౌర విద్యుత్ ఏర్పాటుతో వ్యవసాయ మార్కెట్ యార్డుకు విద్యుత్ బిల్లుల భారం తప్పనుంది. నిర్మాణాలు పూర్తి కావడంతో ప్రారంభించేందుకు ఉన్నతాధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మంత్రి హారీష్‌రావు చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి మొదటి వారంలో ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

ఘనంగా కనకదుర్గమ్మ జాతర
చిలుకూరు, ఫిబ్రవరి 26: మండలంలోని జెర్రిపోతులగూడెం గ్రామంలో వెలసిన కనకదుర్గ అమ్మవారి జాతర ఉత్సవాన్ని శుక్రవారం గ్రామస్థులు, భక్తులు ఘనంగా నిర్వహించారు. గురువారం సాయంత్రం ప్రభబండ్లను ఊరేగింపుగా తీసుకొని గుడి వద్ద ప్రదక్షణలు జరిపి ప్రభలను గుడి వద్ద వదిలి గ్రామం నుంచి వెళ్లారు. శుక్రవారం ఉదయం నుండి భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో జాతర సందర్భంగా తెలంగాణ ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు, సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కోలాట ప్రదర్శనలు జాతరలో ఆకర్షణగా నిలిచాయి. మండలంలోని గ్రామాలతో పాటు మునగాల, నడిగూడెం, కోదాడ, హుజూర్‌నగర్ మండలల భక్తులు జాతరలో పాల్గొని పూజలు నిర్వహించారు. అమ్మవారి పూజా కార్యక్రమంలో స్థానిక జెడ్పిటిసి బట్టు శివాజి, సర్పంచ్ రేమిడాల జయసుధ రాజు, నాయకులు రంగారెడ్డి, రాంరెడ్డి, శ్రీనివాస్‌యాదవ్, కళాకారులు జగన్‌బృందం, కోలాటబృందం తదితరులు పాల్గొన్నారు.

రైతుల శ్రేయస్సే ప్రభుత్వ ధ్యేయం
* ఎమ్మెల్యే గాదరి కిశోర్
నూతనకల్, ఫిబ్రవరి 26: రైతుల శ్రేయస్సునే ప్రభుత్వ ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసిఆర్ మిషన్‌కాకతీయ ఏర్పాటుచేశారని తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్ అన్నారు. శుక్రవారం మండలపరిధిలోని మిర్యాలల్లో మీషన్‌కాకతీయ రెండవ విడత కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. మిషన్‌కాకతీయ ద్వారా నీటిని నిల్వఉంచి ఖరీఫ్, రబీ సీజన్‌లల్లో రైతులకు సరిపడా తాగునీరు అందించడమే లక్ష్యంగా మిషన్‌కాకతీయ పనులు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. చెర్వు పుడికతీతవల్ల నీరు చెర్వుల్లో నిల్వ ఉండి శాశ్యశ్యామలంగా పంటలు పడుతాయని దేశంలో ఏ రాష్ట్రంలో చేయని బ్రోహతర కార్యక్రమాలను ముఖ్యమంత్రి చేపట్టారన్నారు. అనంతరం వెంక్కెపల్లిలోని బస్‌షెల్టర్‌కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, జెడ్పిటిసి నర్సింగ్‌నాయక్, ఎంపిపి కాసోజు సుమలత, సర్పంచ్ ఇరుగు చిన్ననాగయ్య, ఎంపిటిపి జయప్రద, నాయకులు ఆకుల ఉప్పలయ్య, శ్రీరాంరెడ్డి, వాసు, వీరన్న, చక్రయ్య, వెంకన్న, విద్యాసాగర్, మల్లిఖార్జున్ తదితరులు పాల్గొన్నారు.

పోలీస్ ఉచిత స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలు విడుదల
కలెక్టరేట్(నల్లగొండ), ఫిబ్రవరి 26: పోలీస్ ఉచిత శిక్షణ కోసం ఈనెల 21న నిర్వహించిన స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలను శుక్రవారం జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ ఎన్.సత్యనారాయణ విడుదల చేశారు. మొత్తం 7వేల 140మంది పరీక్షలో పాల్గొనగా 1004మంది అర్హత సాధించారు. వీరిలో ఎస్సీలు 371, ఎస్టీలు 214, బిసిలు 346, ఓసిలు 19, మైనార్టీలు 54మంది ఎంపికైనట్లు కలెక్టర్ తెలిపారు. ఉత్తీర్ణులైన వారు సమీప పోలీస్ స్టేషన్‌లలో ఫలితాలను చూసుకొని, తమ అర్హత సర్ట్ఫికెట్లు వెరిఫికేషన్ చేయించుకోవాలన్నారు. ఆయా శాఖల నుండి నిధులు సమీకరించి మార్చి 1 నుండి నెలరోజుల పాటు శిక్షణను అందిస్తామన్నారు. డిటిసిలో 400 మందికి, టిటిడిసిలో 150, డ్వామాలో 150, ఆర్‌ఎస్‌ఈటిసిలో 100, దేవరకొండలో 200 మందికి శిక్షణను ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఎస్‌పి గంగారాం, ఎజెసి వెంకట్‌రావు, డిఆర్‌వో రవి, డిఆర్‌డిఎ పిడి అంజయ్య, ఎస్సీ కార్పొరేషన్ ఈడి శ్రీ్ధర్, స్టెప్ సిఈవో వేణుగోపాల్, కోనేరు రంగారావు కమిటి డిప్యూటి కలెక్టర్ శ్రీనివాసులు, డిపిఆర్‌వో నాగార్జున తదితరులు పాల్గొన్నారు.