ఈ వారం తార

రుస్తుంతోనైనా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సౌత్‌లో క్రేజీ హీరోయిన్‌గా వెలుగొందిన గ్లామర్ భామ ఇలియానా బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. మొదట్లో రెండు మూడు సినిమాలు చేసినా అవి కెరీర్ పరంగా ఏమాత్రం ఉపయోగపడలేదు. బాలీవుడ్‌లో అవకాశాలు దూరమయ్యాయి. దాంతో మళ్లీ సౌత్ సినిమాలో నటించేందుకు సన్నాహాలు మొదలుపెట్టిన ఈ భామకు ఇపుడు బాలీవుడ్‌లో మరో క్రేజీ అవకాశం దక్కింది. అక్షయ్ కుమార్ హీరోగా రూపొందే సినిమాలో ఇలియానా మెయిన్ లీడ్‌లో నటిస్తుందట. దర్శకుడు నీరజ్‌పాండే నిర్మాతగా మారి ఈ రొమాంటిక్ థ్రిల్లర్‌ను తన శిష్యుడు టినూ దేశాయ్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్నాడట. ఇప్పటికే కథా చర్చలు జరుపుకుంటున్న ఈ చిత్రానికి ‘రుస్తుం’ అనే టైటిల్‌ను పెట్టనున్నారని తెలిసింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి రానుంది. మరి ఈ సినిమాతోనైనా ఇలియానాకు బాలీవుడ్‌లో మంచి బ్రేక్ దక్కుతుందో లేదో చూడాలి.