అంతర్జాతీయం

బొలీవియాలో హోంమంత్రి కిడ్నాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లా పాజ్, ఆగస్టు 26: రాయితీలు కల్పించాలని, ప్రైవేటు కంపెనీల్లో పని చేయడానికి అనుమతించాలని డిమాండ్ చేస్తూ బొలీవియాలో గత వారం రోజులుగా గని కార్మికులు చేస్తున్న ఆందోళన హింసాత్మకంగా మారింది. తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవడంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆందోళనకారులు చర్చలు జరపడం కోసం వచ్చిన హోం శాఖ సహాయ మంత్రి రొడోల్ఫో ఇల్లోన్స్‌ను కిడ్నాప్ చేసి తీవ్రంగా కొట్టి చంపారు. బోలీవియా ప్రభుత్వం సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ బొలీవియాలోని వేలాది మంది గని కార్మికులు గత వారం రోజులుగా సమ్మె చేస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వంనుంచి ఎలాంటి స్పందనా లేకపోవడంతో ఆగ్రహించిన ఆందోళనకారులు గత సోమవారంనుంచి పాండురో ప్రాంతంలోని ఓ హైవేపై రాకపోకలను స్తంభింపజేశారు. ఫలితంగా వేలాది మంది ప్రయాణికులు, వాహనాలు రోడ్డుపై ఆగిపోయాయి. దీంతో ఆందోళనకారులతో చర్చలు జరిపి రోడ్డు దిగ్బంధం ఎత్తివేసేలా ఒప్పించడం కోసం రొడోల్ఫో గురువారం మధ్యాహ్నం అక్కడికి వెళ్లారు. అయితే ఆందోళనకారులు మార్గమధ్యంలోనే మంత్రిని కిడ్నాప్ చేసి ఆ తర్వాత తీవ్రంగా కొట్టడంతో ఆయన చనిపోయారు. ఈ సంఘటన తర్వాత అక్కడ ఆందోళనలు మరింత హింసాత్మకంగా మారాయి. పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. దాదాపు వెయ్యి మందిని పోలీసులు అరెస్టు చేశారు.