అంతర్జాతీయం

చైనా అధ్యక్షుడికి మోదీ బహుమతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాంగ్‌ఝా (చైనా), సెప్టెంబర్ 4: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం చైనా అధ్యక్షుడికి పలు బహుమతులను అందజేశారు. వీటిలో చైనా చిత్రకారుడు రూపొందించిన మోదీ తైలవర్ణ చిత్రం (ఆయిల్ పెయింటింగ్) తో పాటు చైనా భాషలోకి తర్జు మా చేసిన భగవద్గీత, పురాతన భారతీయ గ్రంథాలు, స్వామి వివేకానందుడి విశిష్టతను తెలియజేసే వ్యాసాలు ఉన్నాయి. జి-20 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు శనివారం ఇక్కడికి చేరుకున్న మోదీ చైనా భాషలోకి ప్రొఫెసర్ వాంగ్ జిచెంగ్ తర్జుమా చేసిన పది పురాతన భారత గ్రంథాలను జిన్‌పింగ్‌కు బహూకరించారు. భారత సంస్కృతీ, సంప్రదాయలను అమితంగా ప్రేమించే వాంగ్ జిచెంగ్ ప్రతిష్ఠాత్మక పెకింగ్ విశ్వవిద్యాలంలో హిందీ బోధకుడిగా పనిచేస్తున్నారు. జిన్‌పింగ్‌కు మోదీ బహూకరించిన గ్రంథాల్లో యోగ విద్య విశిష్ఠతను తెలియజేసే గ్రంథంతో పాటు పతంజలి యోగ సూత్రాలు, నారదుడి భక్తి సూత్రాలకు సంబంధించిన గ్రంథాలున్నాయని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ ట్వీట్ చేశారు.