అంతర్జాతీయం

హిల్లరీ ఆరోగ్యం భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, సెప్టెంబర్ 15: అస్వస్థతకు గురయిన హిల్లరీ క్లింటన్ తన ఆరోగ్యానికి సంబంధించిన తాజా మెడికల్ రికార్డులను గురువారం విడుదల చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న హిల్లరీ క్లింటన్ నిమోనియా వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఒకవేళ గెలిస్తే అమెరికా అధ్యక్ష పదవిని నిర్వహించేందుకు ఆమె ఆరోగ్యం సహకరిస్తుందా? అనే సందేహాలు వ్యక్తమైన నేపథ్యంలో ఇలాంటి ప్రశ్నలకు, సందేహాలకు తెరదించే యత్నంలో భాగంగా ఆమె తన మెడికల్ రికార్డులను విడుదల చేశారు. హిల్లరీ క్లింటన్ అమెరికా అధ్యక్షురాలిగా పనిచేయడానికి తగిన ఆరోగ్యంతో ఉన్నారని ఆమె ఫిజీషియన్ లీసా బర్డాక్ తెలిపారు. ‘ఆమె (హిల్లరీ) మానసిక ఆరోగ్యం చాలా బాగుంది’ అని లీ సా పేర్కొన్నారు. అమెరికాపై 9/11 దాడి జరిగి 15 సంవత్సరాలు పూర్తయిన సం దర్భంగా నాలుగు రోజుల క్రితం ఆనాటి మృతులకు శ్రద్ధాంజలి ఘటించేందుకు నిర్వహించిన ఒక కార్యక్రమంలో పా ల్గొన్న హిల్లరీ నిమోనియా కారణంగా కాళ్లు తడబడి నడుస్తూ, తూలుతూ దాదాపు కిందపడిపోయినంత పనిచేశారు.