అంతర్జాతీయం

ఎన్‌ఎస్‌జి, అజర్‌పై మా వైఖరిలో మార్పు లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, అక్టోబర్ 14: అణు సరఫరా దేశాల గ్రూపు(ఎన్‌ఎస్‌జి)లో భారత్ సభ్యత్వం, జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధ్యక్షుడు మసూద్ అజర్‌ను ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేలా చూడడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాల విషయంలో తమ వైఖరిలో ఎలాంటి మార్పూ లేదని చైనా శుక్రవారం స్పష్టం చేసింది. బ్రిక్స్ దేశాల సదస్సులో పాల్గొనడం కోసం చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ శనివారం గోవా రానున్న నేపథ్యంలో చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జెంగ్ షువాంగ్ ఈ విషయం స్పష్టం చేశారు. కొన్ని విభేదాలున్నప్పటికీ భారత్, చైనా సంబంధాలు ఎంతో పురోగతి సాధించాయని, అయితే ఎన్‌ఎస్‌జి, అజర్ విషయంలో తమ వైఖరిలో మార్పు లేదని ఆయన చెప్పారు. పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడి తర్వాత మసూద్ అజర్‌పై నిషేధం విధించాలని కోరుతూ భారత్ ఐక్యరాజ్య సమితిలో చేసుకున్న దరఖాస్తు గురించి విలేఖరులు అడిగిన ప్రశ్నలకు జెంగ్ సమాధానమిస్తూ, ఉగ్రవాద సంస్థలను నిషేధించే ఐక్యరాజ్య సమితికి చెందిన కమిటీ వాస్తవాల ఆధారంగా, సభ్యులందరి ఏకాభిప్రాయం ప్రకారమే పని చేయాలని చైనా మొదటినుంచీ చెబుతోందని ఆయన అన్నారు. సంబంధిత వ్యక్తుల నిషేధంపై అన్ని పక్షాలు విడిపోయి ఉన్నాయని ఆయన అంటూ, అందువల్లనే చైనా అజర్‌ను నిషేధించడాన్ని అడ్డుకుందని అన్నారు. అంతేకాదు రెండోసారి చైనా అడ్డుకోవడం వల్ల దీనిపై ఒక నిర్ణయం తీసుకోవడానికి తగిన సమయం లభిస్తుందని ఆయన చెప్పారు. కాగా, భారత దేశం ఎన్‌ఎస్‌జిలో చేరడానికి సంబంధించి చైనా వైఖరిలో కూడా ఎలాంటి మార్పూ లేదని జెంగ్ స్పష్టం చేశారు. 48 దేశాలకు సభ్యత్వం ఉన్న ఎన్‌ఎస్‌జిలో కొత్తసభ్యులను చేర్చుకోవడంపై సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయాన్ని సాధించాల్సిన అవసరం ఉందని గత నెల చైనా విదేశాంగ శాఖ సహాయ మంత్రి లీ బావోడోంగ్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే కొన్ని వివాదాలున్నప్పటికీ ఇటీవలి సంవత్సరాల్లో భారత్, చైనా సంబంధాలు గణనీయంగా పురోగమించాయని జెంగ్ స్పష్టం చేస్తూ, ద్వైపాక్షిక సంబంధాల్లో పోటీస్థానంలో సహకారం ప్రధాన పాత్ర పోషిస్తోందని చెప్పారు. ఇదిలా ఉండగా, భారత్ గనుక పాకిస్తాన్‌ను ఏకాకిని చేసినట్లయితే చైనా ఆక్రమిత కాశ్మీర్ గుండా వెళ్లే 4600 కోట్ల డాలర్ల వ్యయంతో చేపడుతున్న చైనా-పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ నిర్మాణాన్ని వేగవంతం చేయవచ్చని చైనా విదేశాంగ శాఖకు అనుబంధంగా ఉన్న చైనా ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ కాంటెంపరరీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ డైరెక్టర్ హు షి షెంగ్ అభిప్రాయ పడ్డారు. ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి, ఎలా బయటపడాలనే విషయాన్ని చైనా పాకిస్తాన్‌తో చర్చించాలని కూడా ఆయన అన్నారు.