అంతర్జాతీయం

ప్రజాస్వామ్యాన్ని కించపరచడమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్: అమెరికా ఎన్నికల ప్రక్రియలోని నిజాయితీని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సందేహించడం ప్రమాదకరమని, దేశ ప్రజాస్వామ్యాన్ని కించపరచడమేనని అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో మొదటిసారి ప్రధాన పక్షమైన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఈ ఎన్నికల్లో రిగ్గింగ్, అవినీతి, అక్రమాలు జరుగుతాయని సందేహం వ్యక్తం చేస్తూ తాను ఓడిపోతే ఎన్నికల ఫలితాలను ఆమోదించబోనని తొలుత, తాను గెలిస్తేనే ఎన్నికల ఫలితాలను పూర్తిగా ఆమోదిస్తానని ఈరోజు ప్రకటించటం హాస్యాస్పదమని ఒబామా పేర్కొన్నారు. ఫ్లోరిడాలో గురువారం జరిగిన ఒక ఎన్నికల సభలో ఒబామా మాట్లాడుతూ ఈ పెద్ద దేశంలో ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగే అవకాశమే లేదని రిపబ్లికన్ పార్టీకి చెందిన అత్యధిక మంది అంగీకరిస్తారని అన్నారు. ట్రంప్ చేసిన ఆరోపణలు ఆయన మామూలుగా మాట్లాడే అబద్ధాలను మించి పోయాయని ఒబామా విరుచుకుపడ్డారు. మన ఎన్నికల చట్టబద్ధతపై ప్రజల మనసుల్లో అనుమానపు విత్తనాలను నాటడం ప్రమాదకరమని ఆయన ట్రంప్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పైగా అది మన ప్రజాస్వామ్యాన్ని కించపరచమేనని అన్నారు.