అంతర్జాతీయం

భారతీయ సంతతి డ్రైవర్ సజీవ దహనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిస్బేన్, అక్టోబర్ 28: ఆస్ట్రేలియాలో దారుణం చోటుచేసుకుంది. భారతీయ సంతతికి చెందిన ఓ బస్సు డ్రైవర్‌పై ఓ ప్రయాణికుడు తేలికగా మండే ద్రావకంతో దాడిచేయడంతో మంటలు వ్యాపించి సజీవ దహనమయ్యాడు. మృతుడు మన్‌మీత్ అలీషర్ బ్రిస్బేన్‌లోని పంజాబీ జాతీయుల్లో పేరుగాంచిన సింగర్ కావడం గమనార్హం. అకస్మాత్తుగా, అనూహ్య రీతిలో జరిగిన ఈ ఘటనతో బస్సులో మంటలు వ్యాపించాయి. భయభ్రాంతులకు గురైన ప్రయాణికులు అద్దాలు పగులగొట్టి బయటపడ్డారు. మరికొంతమందిని స్థానికులు రక్షించడంతో ప్రాణనష్టం చోటుచేసుకోలేదు. దిగ్భ్రాంతిని కలిగించే ఈ ఘటన వెనుక జాత్యహంకార కోణం లేదని పోలీస్ కమిషనర్ ఇయాన్ స్టివార్ట్ వెల్లడించారు. ఈ ఘటనలో బస్సులో మంటలు వ్యాపించకపోవడంతో ప్రాణనష్టం పెరగలేదని ఆయన పేర్కొన్నారు. 48 ఏళ్ల అనుమానితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

మసూద్ అజార్ ఉగ్రవాదే
జైషే చీఫ్‌పై ముషారఫ్ వ్యాఖ్యలు

ఇస్లామాబాద్, అక్టోబర్ 28: జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ ముమ్మాటికీ ఉగ్రవాదేనని పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ స్పష్టం చేశారు. విధ్వంసక చర్యలు, బాంబు పేలుళ్లతో అతడికి సంబంధం ఉందని ఆయన తెలిపారు. శుక్రవారం ఓ టివి చానల్‌తో మాట్లాడిన ముషారఫ్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న ఐరాస ప్రతిపాదనకు చైనా మొకాలడ్డడంపై సూటిగా సమాధానం చెప్పలేదు. జైషే మహ్మద్ చీఫ్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే ప్రతిపాదన ఐరాస భద్రతా మండలిలో పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అజార్ ఉగ్రవాది అని ప్రకటించడానికి బలమైన ఆధారాలు లేవని చైనా సాకులు చెబుతూ దాన్ని అడ్డుకుంటోంది. గూఢచర్యం కేసులో ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ ఉద్యోగుల అరెస్టు విషయం ముషారఫ్ దృష్టికి తీసుకురాగా‘ ఆ విషయం నాకు తెలియదు’అని బదులిచ్చారు. అదే నిజమైతే అలాంటి చర్యలను ప్రోత్సహించ కూడదు అని ముషారఫ్ పేర్కొన్నారు. నవాజ్ షరీఫ్ ప్రభుత్వం సమర్ధవంతంగా, దూకుడుగా పనిచేయలేకపోతోందని మాజీ అధ్యక్షుడు అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయంగా దౌత్యపరమైన విషయాల్లో పాకిస్తాన్ ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందిందని ముషారఫ్ అన్నారు. సైన్యం నాయకత్వంలోనే దేశ అభివృద్ది చెందుతుందని భావిస్తున్నారా? అన్న ప్రశ్నకు‘ఆ విషయంలో అనేక సందర్భాల్లో రుజువైంది. ఆర్మీ అధికారంలో ఉన్నప్పుడే పాకిస్తాన్ అభివృద్ధి సాధించింది’అని ఆయన స్పష్టం చేశారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్రవాద శిక్షణ శిబిరాలపై ప్రభుత్వం చూసీచూడనట్టు వ్యవహిస్తుందన్న ఆరోపణలను ఆయన దృష్టికి తీసుకురాగా‘నాకు ఆ విషయం తెలియదు’అని ముక్తసరిగా బదులిచ్చారు. ఎల్‌ఓసి వద్ద భారత్ సర్జికల్ దాడిపై మాట్లాడిన ముషారఫ్ ‘పాక్ అణుశక్తి, బలమైన సైనిక సంపత్తి ముందు అలాంటి బెదిరింపులు సాగవు’అని అన్నారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్‌లో ఆకస్మిక పర్యటనకు వచ్చి ప్రధాని నవాజ్ షరీఫ్‌తో కరచాలనం చేసినంత మాత్రాన ప్రయోజనం లేదని అదంతా కృత్రిమమేనని ముషారఫ్ ఎద్దేవాచేశారు. సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితోపాటు స్పష్టమైన విధానం ఉండాలని ఆయన అన్నారు.