అంతర్జాతీయం

నువ్వా-నేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, అక్టోబర్ 31: మరికొద్ది రోజుల్లో జరుగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు మధ్య పోటీ ‘నువ్వా-నేనా’ అన్నట్లు రసవత్తరంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికల రేసులో నిన్న మొన్నటి వరకూ హిల్లరీ ఎంతో ముందంజలో ఉన్నప్పటికీ ప్రస్తుతం ట్రంప్ ఆమెకు చేరువయ్యాడు. అమెరికాలో ప్రస్తుతం 46 శాతం మంది ప్రజలు హిల్లరీకి మద్దతు పలుకుతుండగా, ట్రంప్‌కు 45 శాతం మంది మద్దతు పలుకుతున్నట్లు అధ్యక్ష ఎన్నికలకు వారం రోజుల ముందు ఎబిసి న్యూస్/వాషింగ్టన్ పోస్ట్ ఆదివారం విడుదల చేసిన జాతీయ స్థాయి సర్వే ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో శనివారం వరకు 2 శాతంగా ఉన్న హిల్లరీ ఆధిక్యత మరింత తగ్గి కేవలం ఒక్క శాతానికి పడిపోయింది. ఇటీవల విడుదలైన ఐదు జాతీయ స్థాయి సర్వేల సగటు ఫలితాల ప్రకారం 47 శాతం మంది మద్దతుతో హిల్లరీ ఎంతో ముందంజలో ఉండగా, ట్రంప్‌కు 42 శాతం మంది మద్దతు పలుకుతున్నట్లు సిఎన్‌ఎన్ వార్తా సంస్థ విడుదల చేసిన ‘పోల్ ఆఫ్ పోల్స్’ ఫలితాలు స్పష్టం చేశాయి. శనివారం వరకూ ఈ ఫలితాల్లో ఎటువంటి మార్పూ లేదని సిఎన్‌ఎన్ పేర్కొంది. అయితే హిల్లరీ క్లింటన్‌కు చెందిన ప్రైవేటు సర్వర్ నుంచి కొత్తగా బయల్పడిన ఇ-మెయిళ్లపై అమెరికా జాతీయ దర్యాప్తు సంస్థ ఎఫ్‌బిఐ (ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇనె్వస్టిగేషన్) దర్యాప్తునకు ఉపక్రమించినంతమాత్రన అధ్యక్ష ఎన్నికల్లో తమ ఓటింగ్ తీరు మారబోదని ప్రతి 10 మందిలో ఆరుగురికి పైగా ఓటర్లు తాజా సర్వేలో స్పష్టం చేయగా, ఎఫ్‌బిఐ దర్యాప్తు నేపథ్యంలో హిల్లరీకి ఓటేయాలన్న ఆసక్తి సన్నగిల్లినట్లు ముగ్గురు ఓటర్లు తెలిపారని ఎబిసి/వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది.