అంతర్జాతీయం

దూసుకొస్తున్న ట్రంప్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, నవంబర్ 1: మరో వారంలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. అంతా హిల్లరీయేనంటూ ప్రపంచం కోడై కూస్తున్న తరుణం! వివాదాలే చిరునామాగా మారిన రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ పనైపోయిందంటూ ఊహాగానాలు! ఉన్న ఫళంగా సీనుమారింది. ప్రపంచం ఎమనుకున్నా తనకేమిటంటూ తనదైన శైలిలో ప్రచారం చేసుకుంటూ పోతున్న ట్రంప్ ‘కార్డు’పడింది. తాజాగా జరిగిన సర్వేలో డెమొక్రటిక్ అభ్యర్థిపై ఆయన ఒక శాతం ఆధిక్యతను సాధించారు. గత మే నెల నుంచి వెనుకబడి పోవడమే తప్ప ముందుకు జరగని ఆయన హిల్లరీపై అత్యంత స్వల్పంగానైనా ఆధిక్యత సాధించడం చర్చనీయాంశంగా మారింది. ఎబిసి న్యూస్/వాషింగ్టన్ పోస్టు సంయుక్తంగా నిర్వహించిన ఈ సర్వేలో ట్రంప్‌ను 46శాతం మంది, హిల్లరీని 45శాతం మంది బలపరిచారు. గత శుక్రవారం జాతీయ సర్వేలు మొదలైనప్పటి నుంచి హిల్లరీ ఏడు పాయింట్లు కోల్పోయారు. అమెరికా విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు ప్రైవేటు ఈ మెయిల్ సర్వర్‌ను హిల్లరీ ఉపయోగించారన్న ఆరోపణలే ఇందుకు కారణంగా చెబుతున్నారు. హిల్లరీకి ప్రతికూల పవనాలు మొదలైతే ట్రంప్ మాత్రం ఏ మాత్రం తగ్గకుండా..తన ధోరణినీ మార్చుకోకుండా అనుకూల ఓట్లను నిలకడగా పెంచుకుంటూ వస్తున్నారు. ఇక ఓటర్ల సానుకూలత విషయంలోనూ హిల్లరీ కంటే ట్రంప్ ఎనిమిది పాయింట్ల ఆధిక్యతలో ఉన్నారని తెలుస్తోంది. తాజా ఫలితాలు ట్రంప్ అనుకూల వాదుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపాయి. ‘రెండు వారాల్లోనే నాకు అనుకూలంగా 12పాయింట్లు వచ్చాయి. తాజా సర్వేలో హిల్లరీ కంటే ముందే ఉన్నాను’అంటూ ట్రంప్ ట్వీట్ చేశారు.