అంతర్జాతీయం

అధ్యక్ష పదవికి అనర్హుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వ్యాలీ ఫోర్జ్/ సాన్‌ఫోర్డ్ (అమెరికా), నవంబర్ 2: అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడటంతో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై దాడిని తీవ్రం చేశారు. అసలు అమెరికా అధ్యక్ష పదవికి ట్రంప్ తగడని, అతనికి ఆ పదవి చేపట్టే అర్హతే లేదని ఆమె విరుచుకుపడ్డారు. మరోవైపు, ట్రంప్ మాత్రం తాను అధ్యక్షుడిగా ఎన్నికయితే చేయబోయే కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. తాను రాజకీయ నాయకుడిని కాదని, తనకు ఎంతో మంచి చేసిన ఈ దేశానికి తిరిగి సేవ చేయడానికే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఎలాగయినా అధ్యక్షురాలిగా ఎన్నిక కావాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న హిల్లరీ క్లింటన్ అందుకోసం తనకు గల గత మూడు దశాబ్దాల రాజకీయ అనుభవాన్ని గట్టిగా ముందుకు తెచ్చారు. ఫ్లోరిడాలోని ఓర్లాండోకు పశ్చిమాన 112 కిలో మీటర్ల దూరంలో గల డేల్ సిటీలో నిర్వహించిన ఒక ఎన్నికల సభలో హిల్లరీ మాట్లాడుతూ ‘నేను నా రాజకీయ జీవితాన్ని పిల్లలు, కుటుంబాల సమస్యలపై పోరాడటానికి కేటాయించాను. సెనేట్ సభ్యురాలిగా పనిచేశాను. సైనిక బలగాల సేవల కమిటీపై ఏర్పాటు చేసిన సెనేట్ కమిటీలో పనిచేశాను. ఒసామా బిన్ లాడెన్‌ను న్యాయం ముందు నిలబెట్టినప్పుడు దానికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవడంలో, పర్యవేక్షించడంలో నేను కీలకపాత్ర పోషించాను’ అని అన్నారు. ‘మీ విదేశాంగ మంత్రిగా, మీకు ప్రాతినిధ్యం వహిస్తూ 112 దేశాలలో పర్యటించి, స్నేహితులతోనూ, శత్రువులతోనూ చర్చలు జరిపాను. మీరు అవకాశమిస్తే అధ్యక్షురాలిగా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను’ అని హిల్లరీ ప్రజలను ఉద్దేశించి అన్నారు.
డొనాల్డ్ ట్రంప్ పెన్సిల్వేనియాలోని వ్యాలీఫోర్జ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ తన ఉపన్యాసంలో ఆరోగ్య సంరక్షణ రంగంపై కేంద్రీకరించారు. ప్రమాదకరమైన ఒబామాకేర్ పథకాన్ని రద్దు చేయకుంటే అది అమెరికా ఆరోగ్య సంరక్షణ విధానాన్ని నాశనం చేస్తుందని ప్రజలను హెచ్చరించారు. తాను అధ్యక్షుడిగా ఎన్నికయితే ఈ ఒబామాకేర్ పథకాన్ని రద్దు చేయడానికి ప్రత్యేకంగా సమావేశం కావలసిందిగా కాంగ్రెస్‌ను కోరుతానని ఆయన హామీ ఇచ్చారు.
2,700 పేజీలు ఉన్న ఒబామాకేర్ పథకం గురించి ఎవరూ చదవలేదని, డెమొక్రాట్లు కూడా ఒబామాను నమ్మి ఆ పథకానికి మద్దతు ఇచ్చారని ట్రంప్ అన్నారు. దేశానికి కొత్త నాయకత్వాన్ని ఎన్నుకోవడానికి ఇది సరయిన సమయమని ఆయన అన్నారు.