అంతర్జాతీయం

ఇండోనేసియాలో భారీ భూకంపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేరేడు, డిసెంబర్ 7: ఇండోనేసియాలోని అసే రాష్ట్రంలో బుధవారం తెల్లవారుజామున సంభవించిన భారీ భూకంపం తాకిడికి కనీసం 97 మంది చనిపోగా, వందలాది మంది గాయపడ్డారు. సుమత్రా దీవుల్లోని ముస్లింలు అధిక సంఖ్యలో ఉండే ఈ జిల్లాలో జనం తెల్లవారుజాము ప్రార్థనలకోసం సిద్ధమవుతుండగా ఈ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.5 పాయింట్ల తీవ్రత కలిగిన ఈ భూకంపం తాకిడికి వందలాది ఇళ్లు, మసీదులు, షాపులు కుప్పకూలిపోవడంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముంది. ఇప్పటివరకు 97 మంది చనిపోయారని, మృతుల సంఖ్య శరవేగంగా పెరుగుతోందని సహాయ, పునరావాస చర్యలు కొనసాగిస్తున్న ఇండోనేసియా సైన్యం ఆసె రాష్ట్రం చీఫ్ తతంగ్ సులేమాన్ చెప్పారు. తాత్కాలిక శిబిరాలను ఏర్పాటు చేయడానికి, క్షతగాత్రులను తరలించడానికి వెయ్యికి పైగా సైనికులను, 900 మంది పోలీసులను రంగంలోకి దింపినట్లు ఆయన చెప్పారు. చాలాచోట్ల కరెంటు లేదని, కొద్ది సంఖ్యలో మాత్రమే జనరేటర్లు పని చేస్తున్నాయని ఆయన తెలిపారు. ఒకవేళ వర్షం వస్తే సహాయక చర్యలకు ఆటంకమేనని కూడా ఆయన తెలిపారు. సముద్రం లోపల 33 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చినట్లు గుర్తించారు. సునామీ వస్తుందన్న భయంతో జనం ఎత్తయిన ప్రాంతాలకు పరుగులు తీశారు. అయితే ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ కాలేదు. చాలామంది మళ్లీ ప్రకంపనలు వస్తాయన్న భయంతో వీధుల్లోనే శిథిలాల మధ్యనే ఉంటున్నారు తప్ప తమ ఇళ్లకు తిరిగి వెళ్లడం లేదు. 2004లో హిందూమహాసముద్రంలోపల శక్తివంతమైన భూకంపం సంభవించడంతో 30 అడుగులకు పైగా రాక్షస అలలు ఆసె ప్రాంతంతోపాటుగా పలు దేశాలను ముంచెత్తడం తెలిసిందే. అప్పుడు ఒక్క ఇండోనేసియాలోనే లక్షా 70 వేల మంది చనిపోయినట్లు అంచనా.
chitram...
భూకంపం తాకిడికి నేలమట్టమైన ఒక భవనం.. శిథిలాలను తొలగిస్తున్న దృశ్యం