అంతర్జాతీయం

మళ్లీ.. అక్కసు కక్కిన ట్రంప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, డిసెంబర్ 10: జీవనోపాధి కోసం పొట్ట చేతబట్టుకుని అమెరికాలో అడుగిడుతున్న విదేశీయులపై పదేపదే అక్కసు వెళ్లగక్కుతున్న ఆ దేశ తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన నైజాన్ని చాటుకున్నాడు. అమెరికాలోని సంస్థల్లో స్థానికులకు బదులుగా విదేశీయులను ఉద్యోగాల్లో చేర్చుకోవడాన్ని అనుమతించే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పాడు. అమెరికన్లను కాకుండా భారతీయులతో పాటు హెచ్-1బి వీసాలను కలిగివున్న ఇతర విదేశీయులను ఉద్యోగులుగా చేర్చుకుంటున్న డిస్నీ వరల్డ్ లాంటి స్థానిక కంపెనీలను పరోక్షంగా ప్రస్తావిస్తూ ట్రంప్ ఈ విషయాన్ని స్పష్టం చేశాడు. లోవాలో గురువారం ట్రంప్ తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, దేశంలో ప్రతి అమెరికన్ జీవితాన్ని కాపాడేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పాడు. ‘అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో కూడా నేను ఉద్యోగాలు కోల్పోయి బలవంతంగా శిక్షణలోకి నెట్టబడిన అమెరికన్ కార్మికులతోనే గడిపా. వారి సాధక బాధకాలేమిటో నాకు తెలుసు. విదేశీ కార్మికుల వల్లనే వీరంతా ఉద్యోగాలు కోల్పోయారు. ఇకముందు ఇలా జరగనివ్వబోను’ అంటూ వేలాది మంది మద్దతుదారుల కరతాళ ధ్వనుల మధ్య ట్రంప్ శపథం చేశాడు. ‘మీ ఉద్యోగాలు పోతాయని, ఆ తర్వాత స్థానంలో ఉద్యోగాలు పొందుతున్న విదేశీయులకు మీరు శిక్షణ ఇవ్వకపోతే మీకు ఉద్యోగ నష్టపరిహారాన్ని (సెవరెన్స్ పే) కూడా చెల్లించరని మీరు ఎప్పుడైనా ఊహించారా? కానీ ప్రస్తుతం అమెరికాలోని చాలా స్థానిక కంపెనీల్లో జరుగుతున్నది అదే. ఇకముందు అలా జరగనిచ్చే ప్రసక్తే లేదు’ అని ట్రంప్ ప్రకటించాడు.