అంతర్జాతీయం

ఇస్లామాబాద్‌లో హిందూ దేవాలయానికి భూమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, డిసెంబర్ 10: పాకిస్తాన్‌లో నివసిస్తున్న హిందువుల దీర్ఘకాలిక డిమాండ్లు పరిష్కారానికి నోచుకోనున్నాయి. ఇస్లామాబాద్‌లో ఆలయ నిర్మాణం, కమ్యూనిటీ సెంటర్, స్మశాన వాటికకు స్థలం కేటాయించాలని హిందువులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. ఇన్నాళ్లకు అధికారులు వీటికి ఆమోదం తెలిపారు. శుక్రవారం ఇక్కడ జరిగిన కేపిటల్ డెవలప్‌మెంట్ అథారిటీ(సిడిఏ) సమావేశంలో సానుకూల నిర్ణయం తీసుకున్నారు. పౌర అధికారులకు బాధ్యతలు అప్పగిస్తూ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రాజధాని సెక్టార్ హెచ్-9లో హిందూ ఆలయం నిర్మాణానికి అర ఎకరం భూమి కేటాయించాలని నిర్ణయించారు. అదే స్థంలో కమ్యూనిటీ సెంటర్, స్మశానవాటిక నిర్మించుకునేలా సిడిఏ అమోదం తెలిపిందని ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ వెల్లడించింది. రాజధానిలో నివసిస్తున్న హిందువుల మేజర్ డిమాండ్లు అవే. ఎప్పటి నుంచో వారు చేస్తున్న డిమండ్లు ఈనాటికి పరిష్కారమయ్యాయని ట్రిబ్యూన్ పేర్కొంది. పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లో 800 మంది హిందువులు నివసిస్తున్నారు. దీపావళి సహా ఏ పర్వదినం వచ్చినా ఇంట్లోనే చేసుకునే పరిస్థితి. అంతేకాదు ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు చేయడానికి స్థలం లేదు. మృతదేహాలను రావల్పిండికి తీసుకెళ్లి దహన సంస్కారాలు జరుపుకొనేవారు. ఇస్లామాబాద్-రావల్పిండి జంట నగరాలకు ఒకే ఆలయం ఉంది. సద్దార్‌లో ఉన్న కృష్ణ మందిర్‌కే వెళ్లేవారు. తాజాగా ఆల్ పాకిస్తాన్ బుద్ధిస్ట్ సొసైటీకి కేటాయించిన భూమి పక్కనే హిందువులు సిడిఏ భూమి కేటాయించింది.