అంతర్జాతీయం

మెక్సికోలో భారీ పేలుళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టుట్లెపెక్, డిసెంబర్ 21: మెక్సికో సిటీ శివార్లలోని టుట్లెపెక్‌లో దేశంలోనే అతిపెద్ద బాణాసంచా మార్కెట్‌లో సోమవారం జరిగిన భారీ పేలుడులో కనీసం 29 మంది చనిపోగా, 70 మందికి పైగా గాయపడ్డారని అధికారులు చెప్పారు. క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలకోసం బాణాసంచా కొనుగోలు చేయడానికి పెద్దసంఖ్యలో జనం ఈ మార్కెట్‌కు వచ్చినప్పుడు ఈ పేలుడు సంభవించింది. దేశ రాజధానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ బాణాసంచా మార్కెట్‌లో స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.50 గంటల సమయంలో సంభవించిన పేలుళ్ల కారణంగా ఆకాశమంతా దట్టమైన పొగలు కమ్ముకోవడంతో పాటుగా రంగురంగుల బాణాసంచాల వెలుగులతో నిండిపోయింది. సంఘటన స్థలంలో 26 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని, మరో ముగ్గురు ఆస్పత్రిలో చనిపోయారని మెక్సికో రాష్ట్ర గవర్నర్ ఎరువీల్ అవిలా చెప్పారు. 70 మంది దాకా గాయపడ్డారని, వారిని ఆస్పత్రుల్లోని ఎమర్జెన్సీ గదుల్లో చేర్చినట్లు ఫెడరల్ పోలీసులు తెలిపారు. మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది దాదాపు మూడు గంటలపాటు శ్రమించాల్సి వచ్చింది. మొత్తం బాణాసంచా మంటల్లో కాలిపోయే వరకు తమ సిబ్బంది వేచి ఉండాల్సి వచ్చిందని పౌరరక్షణ సేవా విభాగం చీఫ్ లూయిస్ ఫెలిప్ చెప్పారు. మొత్తం మార్కెట్ కాలిబూడిదై పోయిందని ఆయన చెప్పారు. గాయపడిన వారిలో చాలామంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, అందువల్ల మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని కూడా ఆయన తెలిపారు. మార్కెట్ దగ్గర్లో ఉన్న చాలా ఇళ్లు, వాహనాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. తమ కుటుంబ సభ్యులు, స్నేహితుల జాడకోసం జనం వెతుకుతూ, సహాయక సిబ్బందిని సాయంకోసం అర్థించడం కనిపించింది. అయితే చాలా మృతదేహాలు పూర్తిగా కాలిపోయి గుర్తుపట్టడానికి వీలులేని స్థితిలో ఉండడంతో వారి పని క్లిష్టమైంది. బాణాసంచా అమ్మకాలకు లైసెన్స్‌లు జారీ చేసే ఆర్మీ క్షతగాత్రులను తరలించడానికి భారీ సంఖ్యలో వాహనాలు, సిబ్బందిని మార్కెట్ వద్ద మోహరించింది పోలీసు వాహనాలు, అంబులెన్స్‌లు కూడా క్షతగాత్రులను తరలించడం కనిపించింది. మెక్సికో అధ్యక్షుడు ఎన్రిక్ పెనా నీటో ప్రమాదం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రమాదంపై దర్యాప్తుకు ఆదేశించారు.