అంతర్జాతీయం

మీడియా బండారం బయటపెడతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఫిబ్రవరి 19: అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునుంచి వివాదాస్పద నిర్ణయాలతో స్వదేశంలోను, ఇతర దేశాల్లోను విమర్శలను ఎదుర్కొంటున్న డొనాల్డ్ ట్రంప్ అమెరికా మీడియా తప్పుడు కథనాల కారణంగానే తన ప్రభుత్వం అప్రతిష్ఠ పాలవుతోందంటూ మరోసారి మండిపడ్డారు. తప్పుడు వార్తలను ప్రచారం చేసే మీడియా లేకుండా అమెరికన్లతో తాను మాట్లాడాలనుకుంటున్నట్లు చెప్పిన ట్రంప్, నిజాయితీ లేని మీడియా బండారాన్ని బైటపెట్టి తీరుతానని కూడా ప్రతిన చేశారు. అధికారం చేపట్టిన నెల రోజుల తర్వాత ఫ్లోరిడాలో జరిగిన కార్యకర్తల ర్యాలీలో ప్రసంగించిన ట్రంప్ దాదాపుగా ఇంతకుముందు ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడిన తీరులోనే మీడియాపై విరుచుకు పడ్డారు. అంతేకాదు అధ్యక్షుడిగా ఈ నెల రోజుల కాలంలో తాను ఎన్నో విజయాలను సాధించినట్లు కూడా చెప్పుకొన్నారు. ఇప్పుడు దేశంలో ఒక ఆశావహ దృక్పథం బలంగా ఉందని ఆయన చెప్పారు. మీడియా అబద్ధాలు ప్రచారం చేయకుండా చూడడానికి తాను చేయగలిగినదంతా చేస్తానని కూడా ట్రంప్ అన్నారు. మీడియాకు సొంత అజెండా ఉందని చెప్పిన ఆయన వాటి అజెండా మీ అజెండా కాదన్నారు.
దాదాపు 9 వేల మంది అభిమానులు పాల్గొన్న ఈ ర్యాలీలో ట్రంప్ ఏం చెప్పదలచుకున్నదీ స్పష్టంగా తెలియనప్పటికీ తన పరిపాలన బాగానే సాగుతోందని చెప్పడం, వైట్‌హౌస్‌లో విభేదాలు తలెత్తాయంటూ మీడియాలో వచ్చిన వార్తలను తిప్పికొట్టడం ఆయన ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది. మీడియానే పెద్ద సమస్యగా ఉందని, అవినీతి వ్యవస్థలో వాళ్లూ భాగస్వాములుగా ఉంటున్నారని అన్నారు. గతంలో కూడా చాలామంది అమెరికా అధ్యక్షులు మీడియాతో పోరాటం చేశారని, వాళ్లు రాసినవన్నీ అబద్ధాలని రుజువు కూడా చేశారని ట్రంప్ చెప్పారు. ఇంతకాలంగా కొనసాగిన అస్తవ్యస్త పాలనను చక్కదిద్దడానికి తాను ప్రయత్నిస్తున్నానని కూడా ఆయన చెప్పుకొన్నారు.