అంతర్జాతీయం

తిరగదోడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్, మార్చి 1: తొమ్మిదేళ్ల క్రితం ముంబైపై జరిగిన ఉగ్రవాద దాడికి సంబంధించి పునర్విచారణ జరపాలని పాకిస్తాన్‌కు భారత్ స్పష్టం చేసింది. ఆ దాడితో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న జమాత్ ఉద్ దవా అధినేత అఫీజ్ సరుూద్‌పై ఉగ్రవాద నిరోధక చట్టం కింద కేసు దాఖలు చేయాలని కోరింది. ఈ దాడి కేసులో వాంగ్మూలాలను నమోదు చేయడానికి వీలుగా 24 మంది సాక్షులను పంపాలన్న పాక్ అభ్యర్థనకు భారత్ తీవ్రంగా స్పందించింది. అందులోనే 26/11 కేసును మళ్లీ దర్యాప్తు చేయాలని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని పాక్ దేశీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన అధికారి వెల్లడించారు. అయితే సాక్షులను పంపాలన్న తమ అభ్యర్థనకు సమాధానం ఇవ్వకుండా ముంబై దాడి కేసును పునర్విచారించాలన్న కొత్త మెలికను భారత్ తెరపైకి తెచ్చిందని ఆయన తెలిపారు. అలాగే అఫీజ్ సరుూద్, లష్కరే తోయిబా కమాండర్ లఖ్వీలపై మళ్లీ దర్యాప్తు జరిపించాలని తాజాగా వెలుగులోకి వచ్చిన సాక్ష్యాధారాలను పరిగణనలోకి తీసుకోవాలని భారత్ డిమాండ్ చేసిందని తెలిపారు. అయితే సరుూద్‌పై బలమైన సాక్ష్యాధారాలను భారత్ అందిస్తే అతడిపై దర్యాప్తు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.