అంతర్జాతీయం

శాశ్వత సభ్యత్వం ఇవ్వాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, మార్చి 8: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వంకోసం తాత్కాలికంగా ‘వీటో’ అధికారం వదులుకోవటానికి సిద్ధంగా ఉన్నామని భారత్ ప్రతిపాదించింది. భారత్‌తోపాటు మండలిలో శాశ్వత సభ్యత్వాన్ని కోరుకుంటున్న జి4 కూటమిలోని బ్రెజిల్, జర్మనీ, జపాన్‌లు కూడా ఈ ప్రతిపాదనను ఓకే చేశాయి. ‘్భద్రతామండలిలో వీటో అధికారం చాలా ముఖ్యమైన అంశం. కానీ, మండలిలో సంస్కరణల ప్రక్రియ వేగవంతం కావటంలో ‘వీటో’ అంశాన్ని మేం అడ్డు రానివ్వం’ అని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ బుధవారం అన్నారు. జి4 దేశాల అంతర్‌ప్రభుత్వ చర్చల సందర్భంగా భారత్ తరపున ఆయన ఈ ప్రతిపాదన చేశారు. మండలిలో ప్రస్తుతం అయిదు దేశాలకు వీటో అధికారం ఉన్న సంగతి తెలిసిందే. కొత్తగా శాశ్వత సభ్యులకు సూత్రప్రాయంగా అధికారం ఉండాలని ఆయన అన్నారు. విస్తరించిన అనంతరం ఒకవేళ ఏదైనా అంశం సమీక్షించేందుకు భద్రతా మండలి ముందుకు వస్తే దానిపై చర్చించి ఒక నిర్ణయం తీసుకునేంతవరకూ వీటో అధికారాన్ని ఈ అయిదు దేశాలు వినియోగించరాదని ఆయన అన్నారు. భద్రతా మండలిని సంస్కరించాలన్న డిమాండ్ చాలాకాలంగా ఉంది. ఇందులో శాశ్వత సభ్యత్వం కావాలని బలంగా కోరుకుంటున్న దేశాల్లో భారత్‌తోపాటు బ్రెజిల్, జర్మనీ, జపాన్‌లు జి-4 కూటమిగా ఏర్పడి ఒకదానికొకటి పరస్పరం మద్దతును ప్రకటించాయి. అయితే కొత్త శాశ్వత సభ్యత్వం బదులుగా దీర్ఘకాలిక సభ్యత్వం పేరుతో కొత్త కేటగిరీని సృష్టించే ప్రతిపాదనను జి4 దేశాలు నిర్ద్వంద్వంగా తిరస్కరించాయి. ఇలాంటి కేటగిరీలు మండలిలో సమతుల్యతను దెబ్బతీస్తాయని అక్బరుద్దీన్ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్‌తోసహా 13దేశాల యునైటింగ్ ఫర్ కనె్సనె్సస్ (యుఎఫ్‌సి) తరపున ఇటలీ శాశ్వత ప్రతినిధి సెబాస్టియానో కార్డి ఈ దీర్ఘకాల సభ్యత్వం ప్రతిపాదన చేశారు. మండలిలో కొత్త శాశ్వత సభ్యుల డిమాండ్‌ను ఈ గ్రూప్ చాలాకాలంగా వ్యతిరేకిస్తున్నది. కొత్త మండలిలో 11సీట్లను అదనంగా కలిపి అందులో తొమ్మిదింటికి దీర్ఘకాల ప్రాతినిధ్యం ఇవ్వవచ్చని ఈ గ్రూప్ ప్రతిపాదించింది. ఈ గ్రూప్‌లోని పాకిస్తాన్, భారత్‌ను వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. యుఎఫ్‌సి ప్రతిపాదన ‘పాత టోపీ’ అని అక్బరుద్దీన్ వ్యాఖ్యానించారు. 1944లోనే వాషింగ్టన్‌లో జరిగిన డంబర్టన్ ఓక్స్ సదస్సులో ఈ ప్రతిపాదన వచ్చిందని దీన్ని ఐక్యరాజ్యసమితి తిరస్కరించిందని ఆయన అన్నారు. శాశ్వత సభ్యుల సంఖ్యను పెంచకుండా మండలిలో చేపట్టే ఏ సంస్కరణ కూడా సమానత్వం కావాలన్న ఆఫ్రికా ఆకాంక్షలకు తీరని అన్యాయం చేసినట్లేనని అక్బరుద్దీన్ పేర్కొన్నారు. 53మంది సభ్యదేశాలున్న ఆసియా పసిఫిక్ గ్రూప్‌నకు రెండు సీట్లు ఉంటే, కేవలం 26దేశాల పశ్చిమ యూరప్ గ్రూప్‌నకు కూడా రెండు సీట్లు ఉండటం ఏ విధంగా సమతుల్యమని ప్రశ్నించారు.