అంతర్జాతీయం

బంగ్లా తీరాన్ని దాటిన ‘మోరా’ తుపాను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా, మే 30: పెను తుపాను మోరా మంగళవారం బంగ్లాదేశ్ వద్ద తీరాన్ని దాటింది. అయితే తీరం దాటే సమయంలో గంటకు 130-150 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీచడంతో వందలాది ఇళ్లు దెబ్బ తినడంతో అధికారులు తీరప్రాంతాలనుంచి 3 లక్షల మందిని ఖాళీ చేయించారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6 గంటల సమయంలో మోరా తుపాను కాక్స్‌బజార్- చిట్టగాంగ్ మధ్య తీరాన్ని దాటిందని బంగ్లాదేశ్ వాతావరణ విభాగం తెలిపింది. అది మరింత ఉత్తరంగా కదలవచ్చని కూడా ఆ విభాగం తెలిపింది. దీని ప్రభావంతో బంగ్లాదేశ్ ఉత్తరప్రాంతం, తీరప్రాంత జిల్లాల్లో ఈదురు గాలులతో పాటుగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 6-7 గంటల మధ్య తుపాను తీరాన్ని దాటినప్పుడు సెయింట్ మార్టిన్ దీవిలో గాలి వేగం గంటకు 130 కిలోమీటర్లు, కాక్స్ బజార్‌లో గంటకు 150 కిలోమీటర్లు ఉన్నట్లు కాక్స్‌బజార్ వాతావరణ విభాగం అధికారి ఎకెఎం నజ్ముల్ హక్ చెప్పారు. చిట్టగాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో, అలాగే కాక్స్‌బజార్ విమానాశ్రయాలలో అన్ని విమానాల రాకపోకలను రద్దు చేశారు. తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే పది జిల్లాల్లోని దాదాపు 3 లక్షల మంది సహాయక శిబిరాల్లో తలదాచుకుని ఉన్నారని డిజాస్టర్ మేనేజిమెంట్ మంత్రిత్వ శాఖ కంట్రోల్ రూమ్ ప్రతినిధి, అదనపు కార్యదర్శిగులామ్ ముస్త్ఫా చెప్పారు. వీరంతా దాదాపు 400 తాత్కాలిక షెల్టర్లు, పాఠశాలలు, ప్రభుత్వ భవనాలులాంటి సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకుని ఉన్నారని ఆయన తెలిపారు. తుపాను ప్రభావం తీవ్రంగా ఉండబోయే కాక్స్‌బజార్, చిట్టగాంగ్, నవఖాలి, లఖింపూర్, ఫేని, చాంద్‌పూర్, బర్గున, పటువాఖాలి, భోలా, బరిసాల్, పిరోజ్ పూర్ జిల్లాల్లోని దాదాపు 25 లక్షల మంది దాని ప్రభావానికి గురి కావచ్చని భావిస్తున్నారు. కాగా, ప్రధాని షేక్ హసీనా స్వయంగా తుపాను పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.