అంతర్జాతీయం

ఉగ్రవాదంపై ఉపేక్ష వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రసెల్స్, మార్చి 30: ఉమ్మడి బలంతో ఉగ్రవాదాన్ని తుదముట్టించాల్సిన అవసరం ఎంతో ఉందని భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. బెల్జియం ప్రధాని చార్లెస్ మైకేల్‌తో బుధవారం సమావేశమైన ఆయన ఉగ్రవాదం ఇరు దేశాలకు ఉమ్మడి శత్రువని, దీన్ని ఉమ్మడి బలంతోనే ఎదుర్కోవాలని ఉద్ఘాటించారు. ఇందులో భాగంగా నేరస్థుల పరస్పర మార్పిడి, ఖైదీల బదలాయింపునకు వీలుగా పరస్పర న్యాయ సహాయ ఒప్పందం, ఇతర అంశాలపై చర్చలను పునఃప్రారంభించాలని స్పష్టం చేశారు. బుధవారం బెల్జియం రాజధాని బ్రసెల్స్ చేరుకున్న మోదీ డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా,స్కిల్ ఇండియా వంటి భారత దేశ ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో పాల్గొనాలని బెల్జియం ప్రభుత్వానికి, కంపెనీలకు ఆహ్వానం పలికారు. బెల్జియం సామర్థ్యం, భారతకు ఉన్న వృద్ధి అవకాశాల కలయికతో అద్భుతమైన రీతిలో వ్యాపారానుకూలమైన పరిస్థితుల్ని సృష్టించుకోవచ్చునన్నారు. దీని వల్ల ఇరు దేశాలకూ ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. భారత్‌నే ఉత్పాదక కేంద్రంగా మార్చుకుని ఇరు దేశాలూ తక్కువ ఖర్చుతో ఉత్పత్తులను చేయవచ్చునని, ఆ విధంగా అంతర్జాతీయ మార్కెట్‌పై పట్టునూ సంపాదించవచ్చునని తెలిపారు. ఒక్క వజ్రాలే కాదు ఇతర ఎన్నో వ్యాపారాలు ఇరు దేశాల భాగస్వామ్యానికి సరికొత్త నగిషీలు అందించే అవకాశం ఉందన్నారు. ప్రపంచంలో మరే దేశంలోనూ లేని విధంగా భారత్‌లో విస్తృతమైన ఆర్థిక అవకాశాలు ఉన్నాయని, ఏడు శాతానికి మించిన వృద్ధి రేటుతో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా దూసుకుపోతున్నామని తెలిపారు. భారత దేశ స్ఫూల ఆర్థిక మూల సూత్రాలు బలంగా ఉండటమే ఈ సుస్థిర అభివృద్ధికి కారణమని తెలిపారు. రాజకీయ, ఆర్థిక మార్పులను స్వయంగా పరిశీలించేందుకు భారత్‌కు రావాలని బెల్జియం ప్రధాన మంత్రిని మోదీ ఆహ్వానించారు. రైల్వేలు, రేవు పట్టణాలను ఆధునీకరించడం, వందకు పైగా స్మార్ట్ సిటీలను నిర్మించడం వంటి వౌలిక సదుపాయాలను మెరుగు పరుచుకోవాలన్న నిర్ణయాల వల్ల పెట్టుబడులకు అవకాశాలు పెరిగాయన్నారు. బెల్జియం కంపెనీలు వ్యాపారానుకూల పరిస్థితుల్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ భాగస్వామ్యాల వల్ల వ్యాపార, వాణిజ్య రంగాల్లో కొత్త పుంతలు తొక్కే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇరు దేశాల మధ్య సాన్నిహిత్యానికి ప్రతీకగా ‘రక్త’సంబంధం కూడా ఉందని తెలిపారు. వందేళ్ల క్రితం అంటే తొలి ప్రపంచ యుద్ధంలో బెల్జియం తరపునే లక్షా 30వేల మంది భారత సైనికులు పోరాడారని, వారిలో 9వేల మంది మరణించారని మోదీ గుర్తు చేశారు. వచ్చే ఏడాది భారత్-బెల్జియం దౌత్య సంబంధాలకు 70సంవత్సరాలు పూర్తవుతాయని, ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని భారత్ రావాలని కింగ్ ఫిలిప్పేను ఆహ్వానిస్తున్నానని తెలిపారు.

చిత్రం... బ్రసెల్స్‌లో ఉగ్రవాద దాడి జరిగిన ప్రాంతాన్ని సందర్శించి మృతులకు నివాళి అర్పిస్తున్న ప్రధాని మోదీ