అంతర్జాతీయం

25 మంది సజీవ దహనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కౌలాలంపూర్, సెప్టెంబర్ 14: మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో ఒక ముస్లిం పాఠశాలలో గురువారం తెల్లవారుజామున సంభవించిన అగ్నిప్రమాదంలో 25 మంది సజీవ దహనమయ్యారు. పాఠశాల కిటికీలన్నిటికీ ఇనుప గ్రిల్స్ ఉండడంతో బైటికి వెళ్లడానికి ఒకే మార్గం ఉండడంతో ప్రాణభయంతో లోపల ఉన్న జనం కేకలు పెడ్తున్నా చుట్టూ ఉన్న జనం చూస్తూ ఉండిపోవలసి వచ్చిందే తప్ప ఎలాంటి సాయం చేయలేకపోయారు. చనిపోయినవారిలో 23 మం ది 13 నుంచి 17 ఏళ్ల వయసు విద్యార్థులే కాగా, మరో ఇద్దరు టీచర్లు కూడా మృతుల్లో ఉన్నారు. చాలామంది పొగ కారణంగాను, తొక్కిసలాటలోను మృతి చెందినట్లు అక్కడి దృశ్యాలను బట్టి అర్థమవుతుంది. తెల్లవారుజామున ప్రార్థనకోసం సైరన్ మోగిన సమయంలో మంటలు చెలరేగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాగా, అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమ ని ప్రాథమికంగా తేలినట్లు అగ్నిమాపక అధికారులు చెప్పారు. చికిత్స పొందుతున్న ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ప్రధాని నజీబ్ రజాక్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మలేసియాలో చాలా మత పాఠశాలలు నిబంధనలు పాటించకుండా నడుస్తూ ఉండడంతో తరచూ అగ్నిప్రమాదాలు జరుగుతూ ఉంటాయి.

చిత్రం.. కౌలాలంపూర్‌లో అగ్నిప్రమాదం జరిగిన పాఠశాల వెలుపల గుమికూడిన జనం