అంతర్జాతీయం

జపాన్‌ను ముంచేస్తాం.. అమెరికాను బూడిదచేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోంగ్యాంగ్, సెప్టెంబర్ 14: వరుస క్షిపణి ప్రయోగాలు జరుపుతూ, పొరుగు దేశాలతో కయ్యానికి కాలుదువ్వుతున్న ఉత్తర కొరియాపై ఐరాస ఆంక్షలు విధించడంలో కీలకపాత్ర వహించిన అమెరికా, జపాన్‌లపై ఉత్తర కొరియా ప్రభుత్వం తీవ్రంగా మండిపడింది. జపాన్‌ను ముంచేస్తామని, అమెరికాను బూడిద చేస్తామంటూ హెచ్చరించింది. గత నెల చివర్లో జపాన్‌లోని హొక్కయిడా దీవిని లక్ష్యంగా చేసుకుని మధ్య తరహా బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన తర్వాత ఉత్తర కొరియా జపాన్‌కు ఇంత తీవ్రస్థాయిలో హెచ్చరిక చేయడం ఇదే తొలిసారి. ‘జపాన్ ఇక ఎంతమాత్రం మా పొరుగున ఉండడానికి అర్హురాలు కాదు. ఒక్క అణు బాంబుతో జపాన్‌కు చెందిన నాలుగు దీవులను ముంచేస్తాం’ అని బయటి ప్రపంచంతో ఉత్తర కొరియా సంబంధాలను పర్యవేక్షించే కొరియా ఆసియా-పసిఫిక్ పీస్ కమిటీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఉత్తర కొరియా అధికారిక వార్తాసంస్థ కెసిఎన్‌ఏ ఈ ప్రకటనను యథాతథంగా విడుదల చేసింది. అమెరికా ప్రధాన భూభాగాలను బూడిద చేసేస్తామని, దాన్ని అంధకారంలో పడవేస్తామని, ఇందుకోసం తాము సముపార్జించుకున్న అన్ని వనరులను ఉపయోగిస్తామని కమిటీ ఆ ప్రకటనలో హెచ్చరించింది. కాగా, ఉత్తర కొరియా చేసిన ప్రకటనపై జపాన్ ప్రభుత్వ ప్రతినిధి యోషిహిడో సుగా స్పందిస్తూ ఇది అత్యంత తీవ్రమైన రెచ్చగొట్టే ప్రకటన అని వ్యాఖ్యానించారు.
పర్వతమే కుంగిపోయింది
ఈ నెల 3న ఉత్తర కొరియా జరిపిన అణు పరీక్ష ఎంతో శక్తివంతమైందని, దాని తీవ్రతకు ఈ ప్రయోగం జరిపిన సొరంగాల పైన ఉన్న పర్వత శిఖరం అమాంతంగా 85 ఎకరాల మేర కుంగిపోయిందని తాజాగా ఒక రాడార్ ఉపగ్రహం తీసిన చిత్రాలను బట్టి తెలుస్తోంది. ఇదివరకు అణు పరీక్షలు జరిపిన వౌంట్ మంతాప్ పర్వతం అడుగున ఉన్న సొరంగాల్లోనే ఉత్తర కొరియా తాజా అణు పరీక్షను కూడా జరిపింది. ఈ అణు పరీక్ష జరపడానికి ముందు ఈ పర్వతం 2,205 మీటర్ల ఎత్తు ఉండగా, పరీక్ష తర్వాత దాని ఎత్తు గణనీయంగా తగ్గిపోయిందని కాలిఫోర్నియాలోని ‘జేమ్స్ మార్టిన్ సెంటర్ ఫర్ నాన్ ప్రొలిఫికేషన్ స్టడీస్’లో తూర్పు ఆసియా ప్రోగ్రామ్ చీఫ్ జేమ్స్ మార్టిన్ తెలిపారు. ‘ఎయిర్ బస్’ అనే స్పేస్ టెక్నాలజీ సంస్థ తన ‘టెర్రా-ఎక్స్’ శాటిలైట్‌ను ఉపయోగించి ఈ చిత్రాలను తీసింది.