అంతర్జాతీయం

మెక్సికో భూకంపంలో 225 దాటిన మృతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెక్సికో సిటీ, సెప్టెంబర్ 20: గత కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా మెక్సికో సిటీని కుదిపేసిన పెనుభూకంపంలో మృతుల సంఖ్య 225కు చేరుకుంది. రెక్టర్ స్కేలు 7.1 తీవ్రతతో సంభవించిన ఈ భయానక భూకంప తాకిడికి అనేక భవనాలు కుప్పకూలిపోయాయి. 1985లో కూడా ఈ రకమైన భూకంపం సంభవించినప్పుడు వేల సంఖ్యలోనే మరణాలు జరిగాయి. ఆ భూకంపం 31వ వార్షికోత్సవం రోజునే ఈ తాజా విలయం సంభవించింది. మెక్సికో అంతటా భూకంప పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలన్నదానిపై డ్రిల్స్ జరుగుతున్న సమయంలోనే ఈ భూకంపం సంభవించింది. భూకంప ప్రాంతమంతా శిథిల భూమిగా మారిపోయింది. స్కూళ్లకు స్కూళ్లు, భవనాలకు భవనాలు, ఇళ్లకు ఇళ్లు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారికోసం బుధవారం విస్తృత స్థాయిలో గాలింపు చర్యలు మొదలయ్యాయి. మరోపక్క సహాయ చర్యలను ముమ్మర ప్రాతిపదికన చేపట్టారు.
ఓ పాఠశాల శిథిలాల నుంచి 25 మృతదేహాలను వెలికితీశారు. వీరిలో నలుగురు మినహా మిగతా అందరూ పిల్లలే కావడం గమనార్హం. ఈ ఉత్పాతంలో అనేకమంది గల్లంతైనట్లు కథనాలు వెలువడుతున్నాయి. మెక్సికో సిటీలోనూ, సమీపంలోని మోరెలోస్ రాష్ట్రంలోను విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో అంధకార పరిస్థితులు నెలకొన్నాయి.

రోహింగ్యాలను వెనక్కి తీసుకెళ్లండి

ఢాకా, సెప్టెంబర్ 20: బౌద్ధమత ఆధిపత్యం గల మైన్మార్ నుంచి ప్రాణభయంతో పారిపోయి వచ్చిన 4లక్షల 20వేల మంది రోహింగ్యా ముస్లింలను తిరిగి వెనక్కి తీసుకెళ్లాలని ఆ దేశానికి బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా మరోసారి పిలుపునిచ్చారు. ఐక్యరాజ్య సమితి (ఐరాస) జనరల్ అసెంబ్లీ సెషన్‌లో పాల్గొనేందుకు న్యూయార్క్‌లో ఉన్న హసీనా అక్కడ బంగ్లాదేశీయులయిన సామాజిక కార్యకర్తలతో మాట్లాడుతూ మైన్మార్‌కు ఈ పిలుపు ఇచ్చారని మీడియా కథనాలు తెలిపాయి. గత మూడు వారాలుగా విస్తృతమయిన రోహింగ్యా ముస్లింల సంక్షోభం విషయంలో మైన్మార్‌పై అంతర్జాతీయ ఒత్తిడిని మరింత పెంచాలని కూడా ఆమె పిలుపునిచ్చారు. ‘వారు మీ పౌరులు. వారిని మీరు తప్పనిసరిగా వెనక్కి తీసుకోవాలి. వారికి ఆశ్రయం ఇచ్చి రక్షణ కల్పించాలి. వారిపై ఎలాంటి అణచివేత, వేధింపులు ఉండకూడదు అని మేము మైన్మార్‌కు చెప్పాం’ అని మంగళవారం రాత్రి న్యూయార్క్‌లో జరిగిన సమావేశంలో హసీనా పేర్కొన్నారు. శరణార్థులను మైన్మార్ వెనక్కి తీసుకోవడానికి బంగ్లాదేశ్ దౌత్యపరమైన కృషిచేస్తూ వచ్చిందని హసీనా చెప్పారు. అయితే తాము ఇచ్చిన పిలుపులకు మైన్మార్ ప్రభుత్వం స్పందించడం లేదని వివరించారు. పైగా, రోహింగ్యా ముస్లింలు తిరిగి తమ స్వదేశంలోకి అడుగు పెట్టకుండా అడ్డుకోవడానికి మైన్మార్ సరిహద్దుల పొడవునా మందుపాతరలను అమరుస్తోందని ఆమె వివరించారు. అంతకన్నా కొన్ని గంటల ముందు మైన్మార్ అసలు నాయకురాలు ఆంగ్ సాన్ సూకీ తన ప్రసంగంలో మైన్మార్ శరణార్థులను తనిఖీ చేసి వెనక్కి తీసుకుంటుందని ప్రకటించారు. రోహింగ్యాలను అక్రమ వలసదారులుగా మైన్మార్ పరిగణిస్తోంది. వారిలో అనేకమంది దశాబ్దాల తరబడి మైన్మార్‌లో నివసించినప్పటికీ వారికి పౌరసత్వం ఇవ్వడానికి నిరాకరిస్తోంది. ఐరాస జనరల్ అసెంబ్లీ సందర్భంగా విడిగా జరిగిన ఇస్లామిక్ దేశాల సమావేశంలో హసీనా మాట్లాడుతూ రోహింగ్యాలు బంగ్లాదేశీయులని మైన్మార్ నేతృత్వంలో రాజ్య ప్రాయోజిత దుష్ప్రచారం సాగుతోందని అన్నారు. మైన్మార్ రోహింగ్యాలకు పౌరసత్వం ఇచ్చి తీరాలని ఆమె డిమాండ్ చేశారు. మైన్మార్ నుంచి పారిపోయి వచ్చిన రోహింగ్యాలకు అత్యవసర మానవతా దృక్పథ సహాయాన్ని అందించాలని ఇస్లామిక్ దేశాలను కోరారు.
పోర్టారికోను కుదిపేసిన
మారియో తుపాను

శాన్ జువాన్, సెప్టెంబర్ 20: బుధవారం పోర్టారికో వద్ద తీరం దాటిన పెనుతుపాను మారియో అమెరికా భూభాగాలను సైతం కుదిపేస్తోంది. నాలుగో కేటగిరీ తుపానుగా మారిన మారియో పెను తుపాను బుధవారం ఉదయం యబుకోవా వద్ద తీరాన్ని దాటినట్లు అమెరికా జాతీయ హరికేన్ సెంటర్ తెలుపుతూ , తుపాను తీరం దాటే సమయంలో పెద్ద ఎత్తున విధ్వంసాన్ని సృష్టించే స్థాయి అలలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది. వందేళ్ల చరిత్రలో అత్యంత ప్రమాదకరమైన తుపానును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని పోర్టారికో గవర్నర్ రికార్డో రోసెల్లో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే 67 వేల మందికి ఆశ్రయం కల్పించగలిగే 500 షెల్టర్లను తెరిచినట్లు ఆయన తెలిపారు. పెను తుపాను తీరం దాటేటప్పుడు వీచిన పెనుగాలుల శబ్దం ఓ మహిళ గుండెలు పిండేలా ఏడ్చినట్లు భయానకంగా ఉందని పెను తుపానులు, హరికేన్ల ఫోటోలను తీసే ఫోటోగ్రాఫర్ మైక్ థీస్ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. 35 లక్షల జనాభా ఉండే పోర్టారికో తీరానికి తుపాను సమీపిస్తూ ఉండడంతో జనం అత్యవసరాలను కొనుగోలు చేయడానికి దుకాణాలకు ఎగబడ్డారు. ‘జాగ్రత్తగా ఉండండి.. మేమంతా మీకు అండగా ఉంటాం. సహాయంతో వస్తాం’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ట్వీట్‌లో పోర్టారికో ప్రజలకు దైర్యం చెప్పారు. గంటకు 155 మైళ్ల వేగంతో వేచే పెనుగాలలకు తోడు కుండపోత వర్షంతో మారియా పోర్టారికో తీరాన్ని తాకే దారిలో ఇప్పటికే అనేక కరేబియన్ దీవుల్లో విధ్వంసాన్ని సృష్టించంది. హరికేన్ ఇమ్రానుంచి ఇంకా పూర్తిగా కోలుకోని అమెరికా, బ్రిటీష్ వర్జీన్ దీవులను సైతం అప్రమత్తం చేశారు.

తాను ఇప్పటివరకు ఎన్నో హరికేన్లను చూశానని, అయితే ఇంత తీవ్రమైన పెను తుపానును చూడలేదని పోర్టారికోలోని స్కూల్ టీచర్ నోమి అవిలెస్ రివేరా అన్నారు. ఇప్పటికే 11 వేల మంది ప్రజలు, దాదాపు 600 పెంపుడు జంతువులు షెల్టర్లలో ఆశ్రయం పొందినట్లు పోర్టారికో గవర్నర్ రొసెల్లో తెలిపారు. పోర్టారికోలోని దాదాపు 40 శాతం గృహాలు కరెంటు లేక కారు చీకట్లో మగ్గుతున్నాయి. కాగా, మారియా పెను తుపాను పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించినట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోందని, పొరుగున ఉన్న డొమెనికా దేశ ప్రధాని రోస్వెల్ట్ స్కెరిట్ తెలిపారు. కమ్యూనికేషన్ వ్యవస్థలు పూర్తిగా ధ్వంసమైనాయని, విమానాశ్రయాలు, రేవులను కూడా మూసివేసినట్లు తెలిపారు.