అంతర్జాతీయం

ఎవరెస్టు ఎత్తు తేలుద్దాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాట్మండు, సెప్టెంబర్ 21: ప్రపంచంలోనే ఎత్తయి వౌంట్ ఎవరెస్టు ఎత్తును కొలవడానికి నేపాల్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. హిమాలయ ప్రాంతంలో 2015లో సంభవించిన భూ కంపానికి ఎవరెస్టు కొలతల్లో మార్పులొచ్చినట్టు కథనాలు వెలువడిన నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టారు. నేపాలే సొంతంగా ఈ లెక్కింపును చేపడుతోంది. 1955 భారత సర్వే ప్రకారం వౌంట్ ఎవరెస్టు ఎత్తు 8,848 మీటర్లు. ‘నేపాల్ ప్రభుత్వం, సర్వే విభాగం ఎవరెస్టు శిఖరం ఎత్తును తిరిగి కొలవనుంది. త్వరలోనే దీనికి శ్రీకారం చుడతారు’ అని సర్వేశాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ నీరజ్ మనంధర్ వెల్లడించారు. నీరజ్ పర్యవేక్షణలోనే ఈ కార్యక్రమం జరగనుంది. వరుస భూకంపాలతో ఎవరెస్టు అస్థిత్వం కోల్పోయిందన్న కథనాలు వెలువడ్డాయి.