అంతర్జాతీయం

మైన్మార్‌లో ఆరని మంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిట్వే (మైన్మార్), సెప్టెంబర్ 23: రోహింగ్యా ముస్లింల సమస్య రావణకాష్టంలా రగులుతూనే ఉంది. రొఖినా రాష్ట్రంలో మసీదు పేల్చివేతకు రోహింగ్యా మిలిటెంట్లు యత్నించారన్న మైన్మార్ సైన్యం ఆరోపణలు మరింత అగ్గిని రాజేసింది. సైన్యం దాడులకు భయపడి దేశంనుంచి పారిపోయిన రోహింగ్యాలు మళ్లీ తిరిగిరాకుండా ఉండేందుకు సైన్యం ఇలాంటి దుష్ప్రచారం చేస్తోందని హక్కుల సంఘాలు విరుచుకుపడుతున్నాయి. రోహింగ్యాలు దేశంలోకి ప్రవేశించకుండా సైన్యం కొత్త డ్రామాకు తెరతీసిందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాడులతో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల్లో మైన్మార్ నాయకురాలు ఆంగ్‌సాన్ సూకీ సైనిక చర్యలు నిలిపివేసినట్టు ప్రకటించారు. నెల రోజుల్లోనే 4,30,000 మంది రోహింగ్యా శరణార్థులు బంగ్లాదేశ్‌కు పారిపోయారు. గత నెల 25న పోలీసు స్థావరాలపై దాడులకు మిలిటెంట్లు ప్రయత్నించారని సైన్యం ఆరోపించింది. బౌద్ధుల దేశంలో జాతిపరమైన దాడులు జరగడంపై ఐరాస తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉండగా మైన్మార్ కమాండర్ ఇన్ చీఫ్ మిన్ అనుంగ్ హైంగ్ చేసిన ప్రకటన సంచలం రేపింది. ఉత్తర రఖినాలోని బుతిదావుంగ్ టౌన్‌షిప్‌లో మదర్సా-మసీదు మధ్య రోహింగ్యాలు పేలుళ్లకు పాల్పడ్డారని ఫేస్‌బుక్‌లో ఆయన పోస్టు చేశారు. మసీదులో ప్రార్ధనలకు వచ్చేవారిని లక్ష్యంగా చేసుకుని మిలిటెంట్లు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. పేలుళ్లు ఎఆర్‌ఎస్ గ్రూపుపనేనని ఆయన చెప్పారు. అయితే పేలుళ్ల కట్టుకథకు సైన్యం రూపకల్పన చేసిందని, ప్రజల్లో సానుభూతి పొందడానికే రోహింగ్యా శరణార్థులపై ఆరోపణలు చేస్తోందని మైన్మార్ హక్కుల సంఘాలు విరుచుపడ్డాయి. రోహింగ్యాల గ్రామాల్లో దహనాలు, ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయని తాజా వీడియో, శాటిలైట్ చిత్రాలను ఉటంకిస్తూ ఆమ్నెస్టీ అంతర్జాతీయ సంస్థ పేర్కొంది. మైన్మార్ సైన్యం సరిహద్దుల్లో నిషేధించిన ఆయుధాలు వాడుతోందని హ్యూమన్ రైట్స్ వాచ్ సౌత్ ఆసియా డైరెక్టర్ మీనాక్షీ గంగూలీ ఆందోళన వ్యక్తం చేశారు.
కిక్కిరిసిన కాక్స్‌బజార్
మైన్మార్ నుంచి పారిపోయి వచ్చిన రోహింగ్యా శరణార్థులతో బంగ్లాదేశ్‌లోని కాక్స్‌బజార్ కిటకిటలాడుతోంది. సరిహద్దు జిల్లాలో ఏర్పాటైన శిబిరాలు నిండిపోయాయి. నాలుగు వారాల్లో 4,30,000 మంది రోహింగ్యాలు బంగ్లాదేశ్‌కు చేరుకున్నారు. అయితే గత మూడు రోజులుగా రోహింగ్యాలు రావడం ఆగిందని, నఫ్ నది లేదా బంగాళాఖాతం మీదుగా పడవల్లో ఎవరూ వచ్చిన జాడ లేదని బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్స్ వెల్లడించారు. ‘రోహింగ్యాలు తరలిరావడం దాదాపు ఆగిపోయింది. ఐరాస కూడా దీన్ని ధ్రువీకరించింది. మా గార్డులు కూడా నిర్ధారించారు’ అని బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (బిజిబి) కమాండర్ ఎస్‌ఎం అర్త్ఫిల్ ఇస్లాం ప్రకటించారు. అయితే ఇంత ఆకస్మాత్తుగా వలసలు ఎందుకు ఆగిపోయిందీ అటు సైన్యం ఇటు బంగ్లా అధికారులకు గానీ అంతుపట్టడం లేదు.

చిత్రం..మైన్మార్‌నుంచి రెండు వారాల క్రితం వచ్చిన రోహింగ్యా కుటుంబం ఒకటి బంగ్లాదేశ్‌లో ఆశ్రయం పొందుతోంది. అయతే ఆ కుటుంబంలోని నూర్ కరీం కనిపించకుండా పోయాడు. కొద్దిరోజుల అనంతరం నూర్ తన కుటుంబాన్ని కలుసుకోగలిగాడు. ఈ సందర్భంగా కుమారుని చూసుకుని ప్రేమగా దగ్గరకు తీసుకుంటున్న తల్లి నన్హార్ బేగం