అంతర్జాతీయం

వచ్చే వారం గాజాకు పాలస్తీనా ప్రధాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జెరూసలెం, సెప్టెంబర్ 25: దశాబ్ద కాలంగా ఫతా, హమాస్‌ల మధ్య విభేదాలకు ముగింపు పలికేందుకు చేపట్టన తాజా ప్రయత్నంలో భాగంగా పాలస్తీనా ప్రధాని రమి హందుల్లా అక్టోబర్ 2న గాజా వెళ్తున్నారని ఆయన ప్రభుత్వం ప్రకటించింది. ఈజిప్టుతో చర్చల అనంతరం ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లో ఉంటున్న పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్‌కు చెందిన ఫతా వర్గంతో రాజీకి చర్యలు తీసుకోవడానికి ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ అయిన హమాస్ అంగీకరించాక హందల్లా గాజా ప్రాంతంలో పర్యటించాలని నిర్ణయించుకోవడం గమనార్హం. గత దశాబ్ద కాలంగా హమాస్, ఫతా వర్గాలు రెండుగా విడిపోయి వెస్ట్‌బ్యాంక్, గాజా ప్రాంతాల్లో పోటీ ప్రభుత్వాలను నడుపుతున్నాయి. పోటీ ప్రభుత్వం (పాలక మండలి)ని రద్దు చేసి ప్రభుత్వం తన పూర్తి మాధ్యతలను చేపట్టడానికి అంగీకరిస్తున్నట్లు హమాస్ ప్రకటించిన తర్వాత అధికార బాధ్యతలను చేపట్టడానికి ప్రధాని, ఆయన ప్రభుత్వంలోని మంత్రులు వచ్చే సోమవారం గాజాకు చేరుకుంటారని ఆ ప్రకటన తెలిపింది. ఈ పర్యటన గురించి హందల్లా కూడా తన ఫేస్‌బుక్ పేజీలో తెలియజేశారు. హందల్లా 2015నుంచి ఇప్పటిదాకా గాజా ప్రాంతంలో పర్యటించలేదు.