అంతర్జాతీయం

ఉ.కొరియాపై అమెరికా ట్రావెల్ బ్యాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, సెప్టెంబర్ 25: తమ దేశంలోకి ప్రవేశించకుండా నిషేధించిన దేశాల జాబితాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరికొన్ని దేశాలను చేర్చారు. తాజాగా ఉత్తర కొరియా, వెనెజులా, చాద్ దేశాల పౌరులను చేర్చారు. దీంతో నిషేధిత దేశాల సంఖ్య 8కి చేరుకొంది. నిషేధిత ఉత్తర్వులపై ట్రంప్ ఆదివారం సంతకం చేశారు. గతంలో ఆరు ముస్లిం దేశాలపై విధించిన నిషేధం ఆదివారంతో ముగిసింది. సోమాలియా, యెమన్, సూడాన్, సిరియా, లిబియా, ఇరాన్ దేశాల పౌరులపై ట్రంప్ అధికారంలోకి వచ్చిన కొత్తల్లో నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ జాబితానుంచి సిరియాను తప్పించి తాజాగా ఉత్తర కొరియా, వెనిజులా, చాద్ దేశాలను చేర్చారు. గతంలో నిషేధం విధించిన దేశాలపై ఆంక్షలు అలాగే కొనసాగనుండగా, తాజాగా జాబితాలో చేర్చిన దేశాల పౌరులపై నిషేధం మాత్రం అక్టోబర్ 18నుంచి అమలులోకి వస్తాయి.
గతంలో సోమాలియా, యెమన్, సిరియా, సూడాన్, లిబియా, ఇరాన్ దేశాలపై ట్రంప్ 90 రోజులపాటు నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ జాబితానుంచి సూడాన్‌ను తొలగిస్తూ కొత్తగా మూడు దేశాలను చేర్చడం గమనార్హం. అయితే వెనిజులాపై నిషేధం ప్రభుత్వ అధికారులు, వారి కుటుంబ సభ్యులపై మాత్రమే కొనసాగుతుందని తాజా ఉత్తర్వులో స్పష్టం చేశారు. ‘అమెరికాను సురక్షితమైన దేశంగా చేయడమే నా మొదటి ప్రాధాన్యత. ఈ కొత్త జాబితాను జారీ చేయడం ద్వారా ఆ పవిత్రమైన బాధ్యతను నెరవేరుస్తున్నాను’ అని ట్రంప్ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.
వరస క్షిపణి, అణు పరీక్షలు లాంటి దుందుడుకు చర్యలతో అమెరికాతో పాటుగా జపాన్, దక్షిణ కొరియా తదితర దేశాలకు పక్కలో బల్లెంలాగా మారిన ఉత్తర కొరియాపై తాజాగా నిషేధం విధిస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కొన్ని రోజులుగా ట్రంప్, ఉత్తర కొరియా నియంత కిమ్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కాగా, ఉగ్రవాదం నిర్మూలనకు అమెరికా తీసుకొంటున్న చర్యలకు చాద్ ఏ విధంగాను సహకరించడం లేదని వైట్‌హౌస్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. చరిత్రలో మొట్టమొదటిసారి దేశ భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ చర్యలు తీసుకోవడం జరిగిందని ఆ ప్రకటన తెలిపింది.

చిత్రం..మోరిస్‌టన్ ఎయర్‌పోర్టులో ట్రంప్