అంతర్జాతీయం

అహంకారపూరితమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, సెప్టెంబర్ 26: పాకిస్తాన్‌ను ఉద్దేశించి భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ చేసిన వ్యాఖ్యలను చైనా మీడియా ఎద్దేవా చేసింది. పాకిస్తాన్ ఉగ్రవాదులను తయారు చేసే దేశం అంటూ ఐరాస జనరల్ అసెంబ్లీలో స్వరాజ్ ఎండగట్టిన సంగతి తెలిసిందే. ‘పాకిస్తాన్‌లో ఉగ్రవాదం ఉన్నమాట వాస్తవమే. అయితే ఆ దేశాన్ని ఉద్దేశించి సుష్మా స్వరాజ్ చేసిన వ్యాఖ్యలు దురహంకార పూరితం’ అని ప్రభుత్వ మీడియా ‘చైనా డైలీ’ ఆరోపించింది. భారత్ మేధావులను, డాక్టర్లను, ఇంజనీర్లను తయారు చేస్తుంటే పాకిస్తాన్ ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని సుష్మాస్వరాజ్ ధ్వజమెత్తారు. పాకిస్తాన్‌పై ఓ అభిప్రాయానికి వచ్చేసిన భారత్ మూఢవిశ్వాసంతో నిందాపూరితంగా వ్యవహరిస్తోందని చైనా డైలీ సంపాదకీయంలో తప్పుపట్టింది. ‘పాకిస్తాన్‌లో ఉగ్రవాదం ఉన్నమాట వాస్తవమే. అలాగే ఈ దేశం దాన్నొక జాతీయ విధానంగా చేసుకుందని విమర్శించడం సరైందికాదు. ఉగ్రవాదం వల్ల పాకిస్తాన్‌కు ఒనగూరేది ఏముంది? ఉగ్రవాదులను ఎగుమతి చేయడంవల్ల డబ్బు లేదా గౌరవం వస్తుందా?’ అంటూ గ్లోబల్ టైమ్స్ నిలదీసింది. ఆర్థికంగానూ, విదేశీ సంబంధాల్లోనూ ఇటీవల పాక్ కాస్త గాడిలోనే పడింది. అయితే భారత్ మాత్రం ఉద్దేశపూరితంగా, అహంభావంతో వ్యవహరిస్తోంది’ అని విమర్శించింది. భారత్‌కు నిజమైన స్నేహితుడిగా పాకిస్తాన్‌ను గౌరవిస్తామని, విభేదాలుంటే పరస్పర చర్చలద్వారా పరిష్కరించుకోవాలని చైనా విజ్ఞప్తి చేసింది. జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించకుండా ఐరాసలో చైనా మోకాలొడ్డుతోందన్న భారత్ ఆరోపణలు బీజింగ్ తోసిపుచ్చింది. పొరుగు దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు నెరపడానికి తాము ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించిన చైనా ‘73 రోజుల డోక్లాం వివాదం పరిష్కారమైంది. దీనికి మేం ఎంతో చొరవ చూపాం’ అని సంపాదకీయంలో పేర్కొంది.