అంతర్జాతీయం

శరణార్థులను ఆదుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* వారి కష్టాల్లో పాలుపంచుకుందాం
* చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిన పోప్
వాటికన్ సిటీ, సెప్టెంబర్ 27: స్వదేశంలో బతకలేక పర దేశాలకు బతుకుబాట పట్టిన శరణార్థులను ఆదుకునేందుకు ప్రతి దేశమూ, ప్రతి పౌరుడూ ముందుకు రావాలని పోప్ ఫ్రాన్సిస్ పిలుపునిచ్చారు. బతుకు పోరాటంలో ప్రాణాలు అరచేత పట్టుకుని పిల్లాపాపలతో పరుగులు తీస్తున్న వారి గాథలను ప్రతి ఒక్కరూ విని స్పందించాలని పేర్కొన్నారు. అమెరికా, యూరప్ సహా పశ్చిమ దేశాల్లో శరణార్థుల వ్యతిరేక సెంటిమెంట్ పెరిగిపోతోందని, ఈ ధోరణిని తొలగించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. బతుకుమీద ఆశతో శరణార్థులు సరిహద్దులు దాటుతున్నారని, అలాంటివారి జీవితాలు గాడిన పడేలా ప్రతి దేశమూ, ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని హితవు పలికారు. సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో కిక్కిరిసిన శరణార్థులను ఉద్దేశించి పోప్ ఫ్రాన్సిస్ ప్రసంగించారు. ఫ్రాన్సిస్ కుటుంబం కూడా ఒకప్పుడు ఇటలీ నుంచి జర్మనీకి వలసవచ్చిన విషయం విదితమే. జీవన పయనంలో తోడ్పాటునందించేందుకు భయపడొద్దు, అలాగే ఆశావహులకు సహకరించేందుకు కూడా భయపడొద్దు అని పోప్ పిలుపునిచ్చారు. పశ్చిమ దేశాల్లో పెరిగిపోతున్న శరణార్థ వ్యతిరేక ధోరణి తొలగిపోయేలా చైతన్యం తీసుకురావాల్సిన అవసరాన్ని పోప్ నొక్కిచెప్పారు.