అంతర్జాతీయం

మొక్కు‘బడులు’ వద్దు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, సెప్టెంబర్ 27: విద్యార్థుల్లో అవగాహనా పటిమ పెంపొందించినప్పుడే స్కూలు విద్యకు సార్థకత ఏర్పడుతుందని ప్రపంచ బ్యాంక్ స్పష్టం చేసింది. భారత్ వంటి దిగువ, మధ్య ఆదాయ దేశాల్లో ఈ రకమైన అవగాహనా సంక్షోభం, నేర్చుకునేందుకు అందుబాటులో ఉండాల్సిన అవకాశాల రాహిత్యం చాలా తీవ్రంగా ఉందని ప్రపంచ బ్యాంకు హెచ్చరించింది. అవగాహనా పరమైన అవకాశాలను పెంపొందించకుండా కేవలం పిల్లల్ని స్కూళ్లకు పంపినంతమాత్రాన ఎలాంటి ప్రయోజనం ఉండదని తేల్చి చెప్పింది. ఈ రకమైన పరిస్థితులు మారకపోతే ఒక అభివృద్ధి అవకాశం వృధా కావడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కోటానుకోట్ల మంది ప్రజలకు తీవ్ర అన్యాయం చేసినట్లే అవుతుందని తెలిపింది. ఇందుకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా పాఠశాల చదువులు, పిల్లల్లో జిజ్ఞాసను పెంపొందించే పాఠ్యాంశాల అవగాహనా అవకాశాలకు సంబంధించి ఒక నివేదికను రూపొందించింది. భారత్ వంటి అనేక దేశాల్లో లక్షలాది మంది విద్యార్థులు ఈ రకమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారని, పాఠశాల దశలో అవగాహనా సంక్షోభం తీవ్రంగా ఉండడం వల్ల నేర్చుకునే అవకాశాలు మృగ్యం కావడం వల్ల అనంతర కాలంలో వీరు అనేక అవకాశాలను కోల్పోతున్నారని, తక్కువ వేతనాలకే జీవనాన్ని కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆ నివేదిక స్పష్టం చేసింది. ఇందుకు ప్రధాన కారణం వీరి ప్రాథమిక మాధ్యమిక పాఠశాల దశలో జీవితంలో విజయం సాధించడానికి అవసరమైన విద్యను పొందలేకపోవడమేనని తెలిపింది. ‘ప్రపంచ అభివృద్ధి నివేదిక 2018’ పేరిట ‘విద్య పరమార్థాన్ని సాధించేందుకు నేర్చుకోవడం’ అన్న శీర్షికతో ఈ అధ్యయనం జరిపింది. మొత్తం 12 దేశాల్లో ప్రాథమిక, మాధ్యమిక పాఠశాల చదువుల తీరుతెన్నులను విశే్లషించింది. ఈ దేశాల్లో రెండో గ్రేడ్ విద్యార్థి ఒక చిన్న పాఠ్యాంశంలో ఒక్క పదాన్ని కూడా చదవలేని స్థితిలో ఉన్నాడని, ఇలాంటి దేశాల్లో మలావి తర్వాతి స్థానాన్ని భారత్ సంతరించుకుందని తెలిపింది. రెండు సంఖ్యల తీసివేత లెక్కలను చేయలేని రెండో గ్రేడ్ విద్యార్థులు కలిగిన ఏడు దేశాల్లో భారత్ ప్రథమ స్థానంలో ఉందని ఈ నివేదిక వెల్లడించింది. ఇక గ్రామీణ భారతంలో మూడో గ్రేడ్‌లో ఉన్న విద్యార్థుల్లో మూడొంతుల మందికి 46 నుంచి 17 తీసివేస్తే ఎంతో తెలియని పరిస్థితి ఉందని, ఇక ఐదో గ్రేడ్ విద్యార్థుల్లో సగం మంది కూడా ఈ చిన్న సమస్యను పరిష్కరించే స్థాయి కూడా లేదని తెలిపింది. సరైన రీతిలో నేర్చుకోకపోతే విద్య పరమార్థం వృధా అని పేర్కొన్న ప్రపంచ బ్యాంకు, దీని ఫలితంగా పేదరిక నిర్మూలన లక్ష్యాలు నెరవేరవని, సమాన అవకాశాలు అందరికీ సంపద అన్న ధ్యేయాలు దూరమవుతాయని తెలిపింది. విద్యార్థులు ఏ తరగతి చదువుతున్నారని కాకుండా వారిలో నేర్చుకునే సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు పదను పెట్టగలిగితేనే ఈ సమస్యకు పరిష్కారం చిక్కుతుందని తెలిపింది. ఎప్పటికప్పుడు ఇందుకు సంబంధించి విద్యార్థుల అవగాహనా పటిమను మదింపు చేసే చర్యలు చేపట్టాలని కూడా సూచించింది. అందరికీ నేర్చుకునే అవకాశాల లక్ష్యం దిశగా ఓ సామాజిక ఉద్యమాన్ని చేపట్టాల్సిన అవసరం కూడా ఉందని తెలిపింది. ఈ అవకాశం ఎవరికీ దూరం కాకుండా ఉన్నప్పుడే చదువు సార్థకం అవుతుందని, అనంతర కాలంలో విద్యార్థులు పోటీ వాతావరణాన్ని తట్టుకుని నిలబడతారని తెలిపింది.

మండలిలో భారత్‌కు ‘శాశ్వత’ చోటు
* యుఎస్ కాంగ్రెస్ సభ్యుల తీర్మానం
* క్రమంగా పెరుగుతున్న బలం

వాషింగ్టన్, సెప్టెంబర్ 27: ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాలన్న అంశానికి మరింత బలం చేకూరింది. అమెరికా ప్రతినిధుల సభ్యుల్లో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న ఇద్దరు, మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి అనుకూలంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. పార్లమెంట్ విదేశీ వ్యవహారాల కమిటీ ఉపాధ్యక్షుడు అమి బెరా, కాంగ్రెషనల్ కాకస్ వ్యవస్థాపకుడు, సీనియర్ సభ్యుడు ఫ్రాంక్ పాలోన్‌లు మండలిలో భారత శాశ్వత సభ్యత్వానికి మద్దతిస్తూ తీర్మానాన్ని ప్రతిపాదించారు. ‘ప్రపంచంలోనే అతి పెద్ద, ప్రాచీన ప్రజాస్వామ్య వ్యవస్థలైన అమెరికా, భారత్‌లు అనేక రంగాల్లో కలిసి ముందుకెళ్తున్నాయి. విలువల పరిరక్షణ విషయంలో సారూప్యతను ప్రదర్శిస్తూ, రక్షణ వ్యవహారాల్లో పరస్పరం సహకారం అందించుకుంటున్నాయి. దక్షిణాసియా దేశాల్లో బలమైన దేశం గుర్తింపు తెచ్చుకున్న భారత్, ఇప్పుడు అనేక అంశాల్లో అమెరికాకు వ్యూహాత్మక భాగస్వామి. గత 60 ఏళ్లుగా ప్రపంచ శ్రేయస్సు కోసం భద్రతా మండలిలోని ఐదు దేశాలు కృషి చేసిన మాట వాస్తవమే. అయితే ఇప్పుడు అలాంటి పాత్ర పోషించగలిగే దేశంగా భారత్‌ను గుర్తించక తప్పదు’ అని బెరా వ్యాఖ్యానించారు. మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించడం ద్వారా ప్రపంచంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేసినట్టవుతుందని అభిప్రాయపడ్డారు. ‘అంతర్జాతీయ సంబంధాలను పునర్నిర్వచించాల్సిన తరుణమిది. అందుకు కారకులవుతున్న దేశాల సామర్థ్యాలను గుర్తించి కలుపుకుని ముందుకెళ్లడమే మంచిది’ అని మరో సభ్యుడు పాలోన్ వ్యాఖ్యానించారు. ఉగ్రవాద, కుట్రపూరిత దేశాల నుంచి భవిష్యత్‌లో తలెత్తే ప్రమాదాలను సమర్థంగా ఎదుర్కొవాలంటే భారత్‌లాంటి దేశాలను కలుపుకుని పోవాలని అన్నారు. మండలి బలానికి భారత్ బలం తోడైతే పదికాలాలపాటు ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని వ్యాఖ్యానించారు. ‘ప్రపంచానికి, ట్రంప్ ప్రభుత్వానికి ప్రతినిధుల సభ సూచించేది ఒక్కటే. మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించడం భవిష్యత్‌కు వ్యూహాత్మక అడుగు అవుతుంది’ అని పాలోన్ వ్యాఖ్యానించారు. ప్రపంచ శ్రేయస్సును కాంక్షిస్తూ పెద్దన్న పాత్ర పోషిస్తున్న దేశాల సరసకు భారత్ త్వరలో చేరనుందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ కాకపోదు.

థాయ్ మాజీ ప్రధానికి
ఐదేళ్ల జైలుశిక్ష

* బియ్యం కుంభకోణం కేసులో తీర్పు
బ్యాంకాక్, సెప్టెంబర్ 27: సబ్సిడీ బియ్యం కుంభకోణం కేసులో ధాయ్‌లాండ్ మాజీ ప్రధాని యింగ్‌లక్ షినావాత్రకు దేశ అత్యున్నత న్యాయస్థానం ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. సబ్సిడీ బియ్యం పథకానికి కోట్లాది రూపాయల దుబారా అవుతున్నా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆమెపై అభియోగం. అయితే తనపై వచ్చిన అభియోగాలు రాజకీయ దురుద్దేశంతో చేసినవని ఆమె ఆరోపించారు. కోర్టు విచారణలో ఉండగానే షినావాత్ర దేశం విడిచి వెళ్లిపోయారు. శిక్ష పడుతుందని ముందే ఊహించి ఆమె గత నెలలో దుబాయి వెళ్లిపోయారని కథనాలు వెలువడ్డాయి. టెలీకమ్యూనికేషన్ వ్యాపారవేత్త, మాజీ ప్రధాని తాక్సిన్ షినావాత్ర అక్కడే ఉంటున్నారు. ఆయన వద్దకు వెళ్లినట్టు భావిస్తున్నారు. తాక్సిన్ రాజకీయ వారసురాలిగా 2011లో ఆమె ప్రధానిగా ఎన్నికయ్యారు. థాక్సిన్ ఆమెకు స్వయానా సోదరుడే. సబ్సిడీ బియ్యం పథకాన్ని మేనిఫెస్టోలో ప్రకటించిన ఎన్నికల్లో పెయి థాయ్ పార్టీ ఘన విజయం సాధించింది. అయితే అట్టహాసంగా ప్రారంభించిన సబ్సిడీ బియ్యం పథకం పక్కదారి పట్టిందని, అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయని ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. గ్రామీణ ఓటర్లను మభ్యపెట్టడానికి రాజకీయ లబ్ధికోసమే దీన్ని ఉపయోగించుకున్నారని ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. అక్రమాలు జరుగుతున్నా దేశ ప్రధానిగా తన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించలేకపోయారని ఆరోపించారు. దీని ప్రభావం ప్రభుత్వ ఖజానాపై పడిందని ఆమెపై అభియోగం మోపారు. 2014లో ఆమె ప్రభుత్వాన్ని సైన్యం కూలదోసింది.

వాళ్లు.. మీ డార్లింగ్‌లే!

* ఉగ్రవాదులకు వైట్‌హౌస్‌లో ఆతిథ్యం
* 20ఏళ్ల కిందటి విషయాన్ని మర్చిపోవద్దు
* ట్రంప్‌కు పాక్ విదేశాంగ మంత్రి కౌంటర్

న్యూయార్క్, సెప్టెంబర్ 27: ఏ వ్యక్తులను, సంస్థలను పదే పదే ప్రస్తావిస్తూ పాక్‌ను ఉగ్రదేశంగా చిత్రించేందుకు ప్రయత్నిస్తున్నారో, ఒకప్పుడు ఆ వ్యక్తులు, సంస్థలు మీకు ‘డార్లింగ్‌లే’ అంటూ పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఖవాజా అసిఫ్ అమెరికాకు కౌంటర్ ఇచ్చారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం మానుకోవాలని, లేదంటే అమెరికా నుంచి అందుతున్న సాయం ఆగిపోతుందంటూ గత నెలలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్వరంతో హెచ్చరించటం తెలిసిందే. ఉగ్రవాదంపై పాకిస్తాన్‌కు అమెరికా నుంచి వస్తున్న హెచ్చరికల నేపథ్యంలో ఆ దేశ విదేశాంగ మంత్రి బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘లష్కర్ ఏ తోయిబా, హకానీస్, జైషే మహ్మద్‌లాంటి ఉగ్రవాద సంస్థలతో మా దేశానికీ ఇబ్బందులున్నాయి. హఫీజ్ సరుూద్ లాంటి వ్యక్తులు పాక్‌కు తలపోటే. పాక్ గడ్డనుంచి వారిని త్వరలోనే తరిమికొడతాం’ అని ఆసియా సొసైటీ ఫోరంలో మాట్లాడుతూ స్పష్టం చేశారు. ముంబయి ఉగ్రదాడి వ్యూహకర్త హఫీజ్ సరుూద్, లష్కర్, జైషే సంస్థలను పరోక్షంగా ప్రస్తావిస్తూ ‘20, 30 ఏళ్ల కిందట వీళ్లంతా మీ డార్లింగ్‌లే. మీరు పెంచి పోషించిన వాళ్లే. వీళ్లంతా వైట్‌హౌస్‌లో మందు, విందుల ఆతిథ్యం స్వీకరించారు కూడా. మీ ‘ఉగ్ర’బూచిని మాకు ఆపాదించి మమ్మల్ని బదనాం చేయడం మానుకోండి’ అంటూ తీవ్రంగా స్పందించారు. ఉగ్రవాదులు పాకిస్తాన్‌లో స్వేచ్ఛగా సంరిస్తున్నారని చెప్పడం చాలా సులువు. మాకు శిరోభారం అంటూనే, ‘ఉగ్రవాద ఇబ్బందులు నేనూ అంగీకరిస్తాను. దాన్ని తరిమికొట్టడానికి మాకు కొంత సమయం కావాలి, అందుకు తగిన ఆధారాలూ దొరకాలి’ అని పాక్ విదేశాంగ మంత్రి అసిఫ్ ఫోరం ప్రసంగంలో వ్యాఖ్యానించినట్టు ఏపిపి పేర్కొంద