అంతర్జాతీయం

ఉత్తర కొరియాపై ఏ క్షణంలోనైనా సైనిక దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, సెప్టెంబర్ 27: ఉత్తర కొరియాపై ఏ క్షణంలోనైనా సైనిక దాడి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. క్షిపణి, అణు పరీక్షల విషయంలో ఉత్తర కొరియాను దారిలోకి తెచ్చేందుకు అన్ని ప్రయత్నాలు విఫలమైన నేపథ్యంలో ఇక సైనిక చర్యే మిగిలిందన్న సంకేతాలను ఆయన అందించారు. ఇందుకు అమెరికా పూర్తి సన్నద్ధంగా ఉందని స్పష్టం చేసిన ట్రంప్ ఈ పోరాటంలో బాధ్యతాయుతమైన దేశాలన్నీ చేతులు కలపాలని పిలుపునిచ్చారు. ఉత్తర కొరియాను పూర్తిగా అణుపరంగా నిర్వీర్యంగా చేసేందుకు, ఆ విధంగా ఏకాకిని చేసేందుకు పూర్తి సహకారం అందించాలని ఆయన కోరారు. అమెరికా బాంబర్లను కూల్చి వేసి మరీ తమ దేశాన్ని కాపాడుకుంటామంటూ ఉత్తర కొరియా హెచ్చరించిన నేపథ్యంలో ట్రంప్ తీవ్రస్వరంతో ఈ ప్రకటన చేశారు. సైనిక చర్య అన్నది తాము ప్రాధాన్యత ఇస్తున్న అంశం కాకపోయినా అందుకు పూర్తి సన్నద్ధంగా ఉన్నామని, ఒక వేళ అదే జరిగితే ఉత్తర కొరియా పూర్తిగా ధ్వంసమై పోతుందని ట్రంప్ చెప్పారు. పరిస్థితులు అంతదాకా వెళితే మాత్రం వెనుదిరిగేది లేదన్న సంకేతాలను స్పెయిన్ ప్రధాని మారియాతో కలిసి నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో ట్రంప్ స్పష్టం చేశారు. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ దారుణంగా ప్రవర్తిన్నారని, ఎవరూ చేయని ప్రకటనలు చేస్తూ పరిస్థితిని దిగజారుస్తున్నారని ట్రంప్ అన్నారు. ఉత్తర కొరియాను పాతికిళ్ల క్రితమో,ఇరవై ఏళ్ల క్రితమో, కనీసం అయిదేళ్ల క్రితమో అదుపులోకి తెచ్చి ఉంటే ఈ రకమైన పరిస్థితి తలెత్తి ఉండేది కాదన్నారు. ‘ఇప్పటివరకు వచ్చిన అమెరికా అధ్యక్షులందరూ ఆ పని చేయకుండా ఈ భారాన్ని నాపై వేశారు’ అని ట్రంప్ అన్నారు. ఉత్తర కొరియా అణ్వాయుధాలు, క్షిపణి కార్యక్రమాలు మొత్తం ప్రపంచానికే తీవ్ర నష్టం కలిగిస్తుందని హెచ్చరించారు. ఈ పరిస్థితి రాకుండా అన్ని దేశాలు బాధ్యతాయుతమైన రీతిలో ముందుకు రావాలన్నారు.