అంతర్జాతీయం

40శాతం ద్రవ్యరాశిని కోల్పోయిన భూమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, సెప్టెంబర్ 28: ‘్భగోళం పుట్టుకకోసం రాలిన సురగోళాలెన్నో..’ అన్నారు మహాకవి ఆరుద్ర. విస్తృతమైన ఖగోళ విజ్ఞానాన్ని, ఈ భూగ్రహం ఆవిర్భావానికి దారితీసిన పరిణామాలను ఒక గేయంలో చక్కగా, సమర్థవంతంగా, వినసొంపుగా పొందుపరిచారు ఆరుద్ర. అంటే కోట్లాది మంది జీవిస్తున్న ఈ భూగోళం పుట్టుక అంత సవ్యంగా సాగిందేమీ కాదు. అయితే విధ్వంసకరంగా, అస్తవ్యస్తంగా సాగిన ఈ ప్రక్రియలో భూమి స్వయంగా తన ద్రవ్యరాశిలో 40 శాతానికి పైగా కోల్పోయినట్టు తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. మనం నివసిస్తున్న ఈ భూగ్రహం, దీని పొరుగున ఉన్న అంగారక గ్రహం పుట్టుక గురించి ఈ తాజా అధ్యయనం కొత్త కోణాలను ఆవిష్కరించింది. పదార్థాల కలయిక వల్ల గ్రహాలు ఆవిర్భవిస్తుంటాయి. వివిధ పదార్థాలు లేదా శకలాలు పరస్పరం ఢీకొనే ఈ ప్రక్రియలో అవి పొరుగున ఉన్న వాటితో కలిసిపోతుంటాయి. ఇది తరచుగా అస్తవ్యస్తమైన ప్రక్రియ ద్వారా జరుగుతుంటుంది. ఈ ప్రక్రియలో పదార్థం తన ద్రవ్యరాశిని కొంత పెంచుకోవడమో లేదా కోల్పోవడమో జరుగుతుంటుంది. ఈ సౌర వ్యవస్థలో భారీ గ్రహశకలాలు సెకనుకు కొన్ని కిలో మీటర్ల దూరం వరకు తమ ప్రభావాన్ని చూపుతున్నాయి. గణనీయమైన పరిమాణంలో ఉష్ణాన్ని సృష్టిస్తున్నాయి. ఇది శిలాద్రవం గల మహాసముద్రాలను, ఆవిరితో ఏర్పడే శిలలతో కూడిన వాతావరణాన్ని సృష్టిస్తుంది.
గ్రహాలు అంగారకుడి పరిమాణంతో సమానమైన పరిమాణాన్ని పొందడానికి ముందు వాటి గురుత్వాకర్షణ చాలా బలహీనంగా ఉండింది. ఎడతెరిపి లేకుండా ఈ గ్రహశకలాలు పరస్పరం ఢీకొన్న ప్రక్రియల సందర్భంగా వాటి కూర్పులో మార్పులు సంభవించాయి.