అంతర్జాతీయం

చైనా-పాకిస్తాన్ యుద్ధ విన్యాసాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, సెప్టెంబర్ 28: చైనాలో ఇటీవల నిర్వహించిన సంయుక్త సైనిక విన్యాసాల్లో భాగంగా మొట్టమొదటిసారిగా చైనా, పాకిస్తాన్‌లకు చెందిన వైమానిక దళ పైలట్లు యుద్ధ విమానాలను నడిపారు. గురువారం మీడియా సమావేశంలో చైనా ఆర్మీ ప్రతినిధి కల్నల్ వు క్వియాన్ ఈ వీడియోను ప్రదర్శించడం ద్వారా తమ రెండు దేశాల మధ్య సంబంధాలు ఎంతగా బలమైనవో మరోసారి చాటిచెప్పారు. జింజియాన్ నగరంలో ఈ నెల 2వ తేదీనుంచి 25 దాకా ‘షహీన్-6’ పేరుతో జరిగిన ఈ సంయుక్త వైమానిక విన్యాసాల్లో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. పాకిస్తాన్, చైనా దేశాల సైన్యాల మధ్య ఉన్న సహకారాన్ని అన్నికాలాల్లో నిలిచి ఉండే సోదరభావం, అత్యున్నత స్థాయి పరస్పర సహకారం, మద్దతు, బలమైన వ్యూహాత్మక పరస్పర విశ్వాసంతో కూడుకొన్నదిగా ఆయన అభివర్ణించారు. అయిదేళ్ల క్రితం మొదలైన ఈ విన్యాసాల్లో మొట్టమొదటిసారిగా ఇరు దేశాల వైమానిక దళ పైలట్లు రాత్రి పూట యుద్ధ సన్నద్ధ శిక్షణా కార్యక్రమాలను నిర్వహించినట్లు వు తెలిపారు. అంతేకాదు ఇరు దేశాలకు చెందిన పైలట్లు కూడా ఒకే రకమైన విమానాలను నడిపారని ఆయన తెలిపారు.