అంతర్జాతీయం

శరణార్థుల సంఖ్యను భారీగా కుదించిన అమెరికా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, సెప్టెంబర్ 28: అమెరికా వచ్చే ఏడాది స్వీకరించే శరణార్థుల సంఖ్యను గణనీయంగా కుదించనుంది. వచ్చే ఏడాది కేవలం 45 వేల మందిని మాత్రమే అంగీకరిస్తుందని, 2016తో అంగీకరించిన వారి సంఖ్యతో పోలిస్తే ఇది సగమే ఉంటుందని తెలుస్తోంది. అయితే అమెరికా తమ దేశంలో ఆశ్రయం కల్పించే శరణార్థుల సంఖ్యను గణనీయంగా తగ్గించాలని తీసుకున్న నిర్ణయాన్ని మానవతా వాదులు, అమెరికా పార్లమెంటు సభ్యులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి రెక్స్ టిల్లెర్‌సన్ త్వరలోనే ఈ విషయాన్ని అమెరికా కాంగ్రెస్‌కు తెలియజేస్తారని ట్రంప్ ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు విలేఖరుల సమావేశంలో చెప్పారు. అధ్యక్షుడి నిర్ణయంపై త్వరలోనే ఒక ప్రకటన జారీ అవుతుందని కూడా తెలుస్తోంది. కొత్తగా దేశంలోకి వచ్చే శరణార్థులను అనుమతించడానికి సంబంధించి పాటించాల్సిన భద్రతాపరమైన విధి విధానాల సమీక్ష వచ్చే నెలకల్లా పూర్తవుతుందని, అయితే వచ్చే ఏడాది దేశంలోకి అనుమతించే శరణార్థుల సంఖ్యను తగ్గించడం జరుగుతుందని అధికారులు స్పష్టం చేశారు.
కాగా, వచ్చే ఏడాది అమెరికాలోకి అనుమతించే ప్రాంతాల వారీగా శరణార్థుల సంఖ్య ఆఫ్రికా ఖండంనుంచి 19 వేలు, తూర్పు ఆసియా 5 వేలు, ఐరోపా, మధ్య ఆసియా 2వేలు, లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాలు 1500, ఆగ్నేయాసియా దేశాలు 17 వేలుగా ఉండవచ్చని తెలుస్తోంది, అమెరికా ప్రజల భద్రత, రక్షణ మాకు ప్రధానం’ అని ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. 2016 ఆర్థిక సంవత్సరంలో అమెరికా ప్రపంచం నలుమూలలనుంచి 84,995 మంది శరణార్థులను అంగీకరించింది. ఈ ఏడాది కూడా దాదాపు 50 వేల మందిని అంగీకరించే దిశగా సాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా శరణార్థులు ఎక్కువ మంది ఆశ్రయం కోసం ఇప్పటికీ అమెరికాకే వస్తుంటారు. అయితే 1980 దశకంలో 2 లక్షలకు పైగా ఉండిన శరణార్థుల సంఖ్య ఇప్పుడు బాగా తగ్గిపోయింది. 1975నుంచి ఇప్పటివరకు అమెరికా ప్రపంచం నలుమూలలనుంచి వచ్చిన 30 లక్షల మందికి పైగా శరణార్థులకు ఆశ్రయం ఇచ్చింది. మానవతా భద్రత విషయంలో అమెరికా నాయకత్వం పాత్రను కొనసాగిస్తూనే నిజంగా అర్హులైన శరణార్థులకు మాత్రమే పునరావాస అవకాశాలను కల్పించబడేలా చూడడం ఈ అంతర్గత భద్రతా కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధికారులు స్పష్టం చేశారు. మానవతా సహాయాన్ని అందించే విషయంలో సైతం అమెరికా ప్రపంచంలోని అన్ని దేశాలకన్నా ముందుందని, గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా 700 కోట్ల డాలర్లకు పైగా మానవతా సహాయాన్ని అందించడం జరిగిందని ఆ అధికారులు స్పష్టం చేశారు. అయితే ఐక్యరాజ్య సమితి అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 2.25 కోట్ల మంది శరణార్థులు, మరో 6.56 కోట్ల మంది బలవంతంగా నిరాశ్రయులుగా మారిన వారు ఉన్నారు. వీరందరినీ ఆదుకోవలసిన అవసరం ఉన్న సమయంలో దేశంలోకి అనుమతించే శరణార్థుల సంఖ్యను 45 వేలకు అమెరికా కుదించడం భావ్యం కాదని సెనేటర్ డియనే్న ఫీన్‌స్టీన్ అన్నారు. ఇది అమానుషత్వమని మరో సెనేటర్ టామ్ కార్పర్ విమర్శించారు. ట్రంప్ ప్రభుత్వ నిర్ణయం అణచివేతకు గురయ్యే ప్రజలను ఆదుకునే దేశంగా అమెరికాకున్న చరిత్రకు మచ్చ తెస్తుందని అమెరికా కాంగ్రెస్ సభ్యులు జాన్ కాన్యర్స్, జో లోఫ్‌గ్రెన్ ఒక సంయుక్త ప్రకటనలో అభిప్రాయపడ్డారు.