అంతర్జాతీయం

సైనిక ఆపరేషన్లకు స్వస్తి పలకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోక్స్ బజార్, సెప్టెంబర్ 29: రోహింగ్యా ముస్లింలు ఎదుర్కొంటున్న భయానక పరిస్థితుల నుంచి వారిని కాపాడాలని, వారి సమస్యలను పరిష్కరించాలని ఐక్యరాజ్య సమితి (ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరిస్ మైన్మార్ నేతలకు పిలుపునిచ్చారు. మైన్మార్ ఆర్మీ అణచివేత కారణంగా లక్షలాది మంది రోహింగ్యా ముస్లింలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇతర దేశాలకు పారిపోతున్నారని, ఈ దుస్థితికి ముగింపు పలకాలని, వెంటనే సైనిక ఆపరేషన్లకు స్వస్తి పలకాలని ఆయన హితబోధ చేశారు. మైన్మార్ నుంచి బంగ్లాదేశ్‌లోకి పారిపోతున్న రోహింగ్యాలతో కూడిన ఒక పడవ బోల్తాపడి 19 మంది నీటిలో మునిగిపోవడం, ఈ ప్రమాదంలో అనేక మంది చనిపోయినట్లు భయాందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఐరాస అధినేత మైన్మార్‌కు ఈ హితబోధ చేశారు. మైన్మార్ ఆర్మీ రోహింగ్యా తిరుగుబాటుదారుల అణచివేతకు పూనుకోవడంతో ముఖ్యంగా ఉత్తర రఖినే రాష్ట్రంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఈ రాష్ట్రంలోని గ్రామాల నుంచి రోహింగ్యా ముస్లింలు ప్రాణభీతితో ఇతర దేశాలకు పారిపోతున్నారు. అయిదు లక్షలకు పైగా మంది రోహింగ్యాలు గత నెలలో ఇలా బంగ్లాదేశ్‌కు పారిపోయారు. మైన్మార్ నుంచి బంగ్లాదేశ్‌కు పడవల్లో పారిపోతుండగా అనేక మంది రోహింగ్యాలు నీట మునిగి చనిపోయారు. మిగిలిన వారు ప్రాణాలతో బయటపడినప్పటికీ వారి పరిస్థితి భయానకంగా తయారయింది. శరణార్థులతో కిటకిటలాడుతున్న సహాయక శిబిరాలలోకి వారు చేరుతున్నారు. ఈ శిబిరాలలో ఆహారం, స్వచ్ఛమైన మంచినీటి కొరత వేధిస్తోంది. ఒక్కసారిగా తీవ్ర స్థాయిలో తలెత్తిన ఈ మానవ సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఐరాస భద్రతా మండలి గత ఎనిమిదేళ్లలో తొలిసారిగా మైన్మార్‌పై చర్చించడానికి సమావేశమయింది. అయితే ఈ భేటీలో సభ్యదేశాలు ఏకాభిప్రాయానికి రావడంలో, సమస్యకు సంయుక్తంగా ఒక పరిష్కారాన్ని కనుగొనడంలో విఫలమయ్యాయి. మైన్మార్ ఆర్మీ దేశంలోని మైనారిటీ జాతి ప్రజలను ఏరివేయడానికి ప్రయత్నిస్తోందని అమెరికా ధ్వజమెత్తగా, చైనా, రష్యాలు మైన్మార్‌కు మద్దతు ప్రకటించాయి. మైనారిటీ జాతిని నిర్మూలించడానికి తాము యత్నిస్తున్నామన్న అమెరికా ఆరోపణలను మైన్మార్ అధినేతలు తీవ్రంగా ఖండించారు. 15 సభ్య దేశాలు గల ఐరాస భద్రతా మండలిని ఉద్దేశించి గుటెరిస్ మాట్లాడుతూ రోహింగ్యాలకు వ్యతిరేకంగా మిలిటరీ ఆపరేషన్లను వెంటనే నిలిపివేయాలని, విధ్వంసంతో అల్లల్లాడుతున్న పశ్చిమ ప్రాంతంలో బాధితులకు సహాయం అందించేందుకు వీలు కలిగించాలని మైన్మార్‌ను కోరారు. మైన్మార్ నుంచి పారిపోయిన శరణార్థులు తిరిగి వెనక్కి రావడానికి ఏర్పాట్లు చేయాలని కూడా ఆయన మైన్మార్‌కు పిలుపునిచ్చారు. ఒక పథకం ప్రకారం రేపిన హింస వల్లనే మైన్మార్‌లోని రఖినే రాష్ట్రం దక్షిణ, మధ్య ప్రాంతాలలోనూ కల్లోల పరిస్థితులు నెలకొన్నాయని ఆయన పేర్కొన్నారు.

చిత్రం..ఆంటోనియో గుటెరిస్